బార్, పబ్, క్లబ్, లాంజ్ మధ్య తేడా ఏమిటో తెలుసా? ఎక్క‌డ ఎటువంటి సేవ‌లు ల‌భ్య‌మ‌వుతాయంటే...

ABN , First Publish Date - 2022-11-07T10:00:41+05:30 IST

చాలా మందికి పార్టీలంటే ఎంతో ఇష్టం. పార్టీ పేరు వినగానే మ‌న‌ మదిలో క్లబ్బులు, బార్లు, పబ్బులు, లాంజ్‌లు మొదలైన ఆలోచనలు మొదలవుతాయి. బహుశా మీరు కూడా ఈ ప్రదేశాలకు వెళ్లి ఉండవచ్చు.

బార్, పబ్, క్లబ్, లాంజ్ మధ్య తేడా ఏమిటో తెలుసా? ఎక్క‌డ ఎటువంటి సేవ‌లు ల‌భ్య‌మ‌వుతాయంటే...

చాలా మందికి పార్టీలంటే ఎంతో ఇష్టం. పార్టీ పేరు వినగానే మ‌న‌ మదిలో క్లబ్బులు, బార్లు, పబ్బులు, లాంజ్‌లు మొదలైన ఆలోచనలు మొదలవుతాయి. బహుశా మీరు కూడా ఈ ప్రదేశాలకు వెళ్లి ఉండవచ్చు. లేదా వీటి పేర్ల‌యినా వినివుండ‌వ‌చ్చు. అయితే వీటి మధ్య వ్యత్యాసం గురించి చాలామందికి తెలియదు. బార్, పబ్, క్లబ్, లాంజ్ మధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే గెట్ టుగెదర్ ప్రదేశాల‌కు ఇవి ఎంత భిన్నంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ప్రదేశాలలో అందించే సేవలు ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బార్

బార్ అంటే మద్యం విక్ర‌యాల‌కు అనుమతి ఉన్న ప్రదేశం. బార్‌లో మద్యం సేవించవచ్చు. అక్కడ కూర్చుని డ్రింక్ చేయ‌వ‌చ్చు. అయితే మ‌ద్యం తాగ‌డం పూర్త‌యిన త‌ర్వాత ఇక్కడ ఎక్కువసేపు ఉండటం సాధ్యంకాదు. బార్‌ను నడపడానికి ప్రత్యేక అనుమతి అవసరం. లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే మద్యం విక్ర‌యించాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా బార్‌లో తినడానికి కొన్ని ఎంపిక చేసిన ఆహార ప‌దార్థాలు కూడా ల‌భ్య‌మ‌వుతాయి.

పబ్

పబ్ అంటే పబ్లిక్ హౌస్ లాంటిది. పబ్‌లో ఆల్కహాల్ డ్రింక్స్ అందిస్తారు. ఇక్క‌డ బార్ మాదిరిగా నిర్దిష్ట ప్రదేశంలో కూర్చొని మాత్రమే మద్యం సేవించాలనే నిబంధనలు లేవు. పబ్ వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మీరు పబ్‌లో డ్యాన్స్ చేయవచ్చు. ఇంతేకాకుండా అనేక ఇతర కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతాయి.

క్లబ్

బార్‌లు, పబ్బుల కంటే క్లబ్‌లలో ఎక్కువ స్థలం ఉంటుంది. క్లబ్‌లో డ్యాన్స్ స్టేజ్ కూడా ఉంటుంది. క్లబ్‌కి వెళ్లేందుకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. సభ్యత్వం తీసుకోవ‌డం ద్వారా దీనిలో ప్రవేశం పొంద‌వ‌చ్చు. ఎక్కువ సేపు ఆనందించడానికి క్లబ్‌లు అనువైన ప్ర‌దేశాలు.

లాంజ్

లాంజ్‌లో కుర్చీలు ఉంటాయి. ఇక్కడ మీరు రిలాక్స్‌గా కూర్చోవచ్చు. బార్‌లో కంటే లాంజ్‌లో కొంచెం తక్కువ నియమాలు ఉంటాయి. ఫ‌లితంగా మీరు ఎక్కువ సేపు ఇక్కడ సేద‌తీర‌వ‌చ్చు.

Updated Date - 2022-11-07T10:00:49+05:30 IST

Read more