ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Viral Video: కుక్క చనిపోవడంతో చలించిన తోటి కుక్కలు.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన తీరు చూస్తే..

ABN, First Publish Date - 2022-03-03T03:11:12+05:30

ఇటీవల సోషల్ మీడియాలో కుక్కలకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కుక్కలకు ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యజమానిని ఒక్కసారి నమ్మితే.. జీవితాంతం కాపలా కాస్తూ వెన్నంటే ఉంటాయి. అందుకే కుక్కలకు ఉన్న విశ్వాసం.. మనుషులకు కూడా ఉండదంటారు.  కుక్కల పట్ల చాలా మంది అమితమైన ప్రేమను చూపిస్తుంటారు. ప్రేమగా చూసుకున్న కుక్కలు ఒక్క క్షణం దూరమైనా జీర్ణించుకోలేరు. ఇటీవల సోషల్ మీడియాలో కుక్కలకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 


ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇవి జంతువులా’ అంటూ క్యాప్షన్ ఇస్తూ పోస్టు చేసిన ఈ వీడియో.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ కుక్క చనిపోవడంతో తోటి కుక్కలన్నీ విషాదంలో ఉంటాయి. వాటికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో ఏమో గానీ.. మనుషులకు అంత్యక్రియలు చేసినట్లే.. చనిపోయిన కుక్కకు కూడా చేయాలని పూనుకున్నాయి. చాలా సేపు శ్రమించి అవే స్వయంగా ఓ గోతిని తవ్వాయి. తర్వాత కుక్క మృతదేహాన్ని అందులో వేసి, మట్టి వేసేందుకు ప్రయత్నిస్తాయి. గొయ్యి చుట్టూ కుక్కలన్నీ చేరి కాళ్లతో మట్టిని వేడయం చూస్తే.. హృదయం చలించక మానదు. సాటి జంతువు పట్ల ఈ కుక్కలకు ఉన్న విశ్వాసంలో కనీసం కొంతైనా మనుషుల్లో ఉంటే ఎంత బాగుంటుంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ మొక్కను ముట్టుకుంటే అంతే సంగతులు.. విత్తనాలే తూటాలై ఎలా వస్తున్నాయో చూడండి..!





సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!