తప్పనిసరి పరిస్థితుల్లో ప్రియుడి సోదరుడితోనే ఆ 26 ఏళ్ల యువతికి పెళ్లి.. చివరకు జరిగింది ఇదీ..!

ABN , First Publish Date - 2022-05-09T20:28:35+05:30 IST

ఆ యువతి ఓ యువకుడిని ఇష్టపడింది. అతడితో కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది. కానీ అతడితో కలసి ఏడు అడుగులు నడవలేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రియుడి సోదరుడితో ఆమెకు వివాహం జరిగిం

తప్పనిసరి పరిస్థితుల్లో ప్రియుడి సోదరుడితోనే ఆ 26 ఏళ్ల యువతికి పెళ్లి.. చివరకు జరిగింది ఇదీ..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి ఓ యువకుడిని ఇష్టపడింది. అతడితో కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది. కానీ అతడితో కలసి ఏడు అడుగులు నడవలేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రియుడి సోదరుడితో ఆమెకు వివాహం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఘోరం జరిగిపోయింది. ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని శివహర్ ప్రాంతానికి చెందిన రింకీ దేవి(26) రితేష్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె అతడిని పెళ్లి చేసుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అతడి సోదరుడు జితేంద్రరాయ్‌ని వివాహం చేసుకుంది. ఈ క్రమంలో నాలుగేళ్లు గడిచిపోయాయి. తాజాగా ఇంట్లో రింకీ దేవి ఒక్కతే ఉన్నట్టు గుర్తించిన రితేష్ ఆమెతో మాట్లాడాలని బయటకు రమ్మన్నాడు. అనంతరం పెళ్లికి ముందులా తనతో రిలేషన్‌షిప్ కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు రింకీ దేవి నిరాకరించడంతో ఆమెను హత్య చేశాడు. ఆధారాలు నాశనం చేసేందుకు యాసిడ్‌తో ఆమె మృతదేహాన్ని శుద్ధి చేశాడు. తర్వాత తనకు ఏమీ తెలియనట్టు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అయితే రింకీ దేవి ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చుట్టు పక్కల ప్రదేశాల్లో గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఊరి బయట పంట పొలాల్లో మహిళ మృతదేహం ఉందనే సమాచారం కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఆ మృతదేహం రింకీ దేవీదే అని గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రింకీ దేవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రితేష్ రాయ్‌పై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 


Read more