ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పెళ్లిపందిట్లో పోయిన కరెంటు.. మారిపోయిన వధువులు

ABN, First Publish Date - 2022-05-10T16:58:44+05:30

ఉజ్జైనీలోని అస్లానా అనే ప్రాంతానికి చెందిన రమేశ్‌లాల్ అనే వ్యక్తికి నికిత, కరిష్మ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాజాగా వారిద్దరికీ ఒకేరోజు పెళ్లి చేశారు. కాగా, వరుళ్లు ఇద్దరు వేరు వేరు కుటుంబాలకు చెందినవారు. మూడు కుటుంబాలు ఒక చోట చేరి..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భోపాల్: గమ్మత్తు, చిత్రమైన ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. రెండు జంటలు పెళ్లి ద్వారా ఒక్కటయ్యాయి. అయితే పెళ్లి ముగించుకుని ఎవరింటికి వారు వెళ్లారు. తమ భాగస్వామితోనే వెళ్లామని అనుకున్నారు. తీరా ఇంటికి వెళ్లాక చూస్తే కానీ తెలియలేదు వధువులు మారిపోయారని. ఇదంతా పెళ్లి మండపంలో కరెంట్ పోవడం జరిగిన తప్పిదం అని తెలుసుకున్నారు. ఆ తర్వాత వియ్యంకుల వారికి ఫోన్లు చేసి జరిగన తప్పిదాన్ని సరి చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైనీ ప్రాంతంలో జరిగిందీ ఘటన.


ఉజ్జైనీలోని అస్లానా అనే ప్రాంతానికి చెందిన రమేశ్‌లాల్ అనే వ్యక్తికి నికిత, కరిష్మ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాజాగా వారిద్దరికీ ఒకేరోజు పెళ్లి చేశారు. కాగా, వరుళ్లు ఇద్దరు వేరు వేరు కుటుంబాలకు చెందినవారు. మూడు కుటుంబాలు ఒక చోట చేరి వీరి పెళ్లిని అంగరంగవైభవంగా నిర్వహించారు. అయితే పెళ్లి ముగుస్తున్న సమయంలో కరెంట్ పోయింది. ముహూర్తం ప్రకారం తంతు నిర్వహించాలని, చీకట్లోనే మిగిలిన పెళ్లి కార్యక్రమం నిర్వహించి అప్పగింతలు కూడా చేశారు. అయితే తీరా ఇంటికెళ్లాక చూస్తే వధూవరులు మారిపోయారు. జరిగిన పొరపాటును గుర్తించి అనంతరం సరి చేసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!