ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కేవలం వంద రూపాయల కోసం స్నేహితుడిని చంపిన యువకుడు .. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-05-06T05:58:14+05:30

కేవలం వంద రూపాయల కోసం ఓ యువకుడు తన స్నేహితుడిని పొట్టన పెట్టుకున్నాడు. మత్తులో ఉన్న ఇద్దరు స్నేహేతుల మధ్య వంద రూపాయలు చిచ్చు పెట్టాయి.. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు క్షణికావేశంలో తన స్నేహితుడిని కర్రతో కొట్టాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కేవలం వంద రూపాయల కోసం ఓ యువకుడు తన స్నేహితుడిని పొట్టన పెట్టుకున్నాడు. మత్తులో ఉన్న ఇద్దరు స్నేహేతుల మధ్య వంద రూపాయలు చిచ్చు పెట్టాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు క్షణికావేశంలో తన స్నేహితుడిని కర్రతో కొట్టాడు.. తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు.. కేసు విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. 


ఢిల్లీలోని స్వరూప్ నగర్‌కు చెందిన మహ్మద్ ఆలం, రాకేష్‌, శ్యామ్ మంచి స్నేహితులు. ఈ ముగ్గురూ డ్రగ్స్‌కు బానిసలై ఏ పనీ చేయకుండా తిరిగేవారు. శనివారం రాత్రి మహ్మద్, రాకేష్ మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వంద రూపాయల కోసం గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ పెద్దది కావడంతో ఇద్దరూ కొట్టుకున్నారు. ఆ క్రమంలో రాకేష్ తలపై మహ్మద్ ఓ పెద్ద కర్ర తీసుకుని కొట్టాడు. రాకేష్ అక్కడికక్కడే కుప్ప కూలడంతో మహ్మద్ అక్కడి నుంచి పారిపోయాడు. 


తర్వాతి రోజు ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్యామ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మహ్మద్ ఆలం, రాకేష్ మధ్య డబ్బుల గురించి గొడవ జరిగినట్టు పోలీసులకు శ్యామ్ చెప్పాడు. దీంతో పోలీసులు మహ్మద్ కోసం అన్వేషణ ప్రారంభించారు. చివరకు సమయ్‌పూర్ మెట్రో స్టేషన్‌లో ఆలం పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసుల మహ్మద్‌ను అరెస్ట్ చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!