ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

19 గంటల NonStop Journey.. Flightలో ఫీచర్స్‌ అదుర్స్‌ !

ABN, First Publish Date - 2022-05-05T22:39:56+05:30

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం నాన్‌స్టాప్‌గా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసమే ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ సరికొత్త విమాన సర్వీస్‌ను అందుబాటులోకి తీసు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం నాన్‌స్టాప్‌గా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసమే ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ సరికొత్త విమాన సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అత్యంత ఎక్కువ దూరం నాన్‌స్టాప్‌గా వెళ్లే ఫ్లైట్‌ను త్వరలోనే తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2025 చివరి నాటిని ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కాగా ఈ ఎయిర్‌లైన్స్‌.. 19 గంటల 19 నిమిషాలు నిర్విరామంగా సిడ్నీ నుంచి లండన్‌కు ప్రయాణించనుంది. 



ఒకే విమానంలో నాన్‌స్టాప్‌గా ప్రయాణాన్ని చేసేలా గత కొన్నేళ్లగా ప్రణాళికలు రూపొందించింది క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌. ఇందుకోసం గత ఐదేళ్ల నుంచే ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రాజెక్ట్‌ సన్‌రైజ్‌ పేరుతో 12 A350-1000 విమానాలను ఆర్టర్‌ చేసింది. 2025 చివరి నాటికి సిడ్నీ నుంచి లండన్‌.. అలాగే న్యూయార్క్‌కు తమ సర్వీసులు ప్రారంభిస్తామని క్వాంటాస్‌ అధ్యక్షుడు అలన్‌ జోయిస్‌ తెలిపారు. ఆ తర్వాత మెల్‌బోర్న్‌ నుంచి కూడా మరిన్ని సర్వీసులు చేపడతామన్నారు. దీంతో పాటు త్వరలో 40 A321 XLR సహా A220 విమానాలను కూడా ఆర్డర్ చేస్తున్నట్లు క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది.



సిడ్నీ నుంచి లండన్‌ మధ్య దూరం 17,800 కిలోమీటర్లు. ఇంత దూరం ఒకే విమానంలో నాన్‌స్టాప్‌గా జర్నీ చేసేలా క్వాంటాస్‌ 2019 నుంచే పలు టెస్ట్‌లు చేసింది. ఈ నాన్‌స్టాప్‌ జర్నీకి 19 గంటల 19 నిమిషాల సమయం పట్టింది. తర్వాత న్యూయార్క్‌ నుంచి సిడ్నీ వరకు 16,200 కిలోమీటర్ల దూరాన్ని 19 గంటల్లో పూర్తి చేసింది. అయితే క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే పెర్త్‌ టు లండన్‌ నాన్‌స్టాప్‌గా ప్రయాణాన్ని నిర్వహిస్తోంది. దీనికి 17 గంటల సమయం పడుతోంది. 


అయితే లాంగ్‌ జర్నీ నేపథ్యంలో క్వాంటాస్‌.. తన విమానాల్లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను ఏర్పాటు చేస్తోంది. మొత్తం 238 మంది ప్రయాణికులకు సరిపడేలా ఈ విమానాల్లో సీటింగ్ కెపాసిటీ ఉండనుంది. ఫస్ట్‌క్లాస్‌ సూట్‌లో ప్రత్యేక బెడ్‌, వాల్ కుర్చీ, వార్డ్ రోబ్‌ను ఏర్పాటు చేయనుంది.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!