ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తమపై ఫిర్యాదు చేసిందనే కోపంతో ఆ ఐదుగురు విద్యార్థులు ఎంత పని చేశారంటే.. కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా..

ABN, First Publish Date - 2022-05-05T22:11:18+05:30

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ‍మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ‍మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజూ దేశంలో ఏదో ఒకచోట మహిళలపై, బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిరక్ష్యరాస్యులే కాదు.. చదువుకున్నవాళ్లు సైతం అత్యంత దారుణాలకి ఒడిగడుతున్నారు. తాజాగా బీహార్‌లో అలాంటిదే ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కొందరు విధ్యార్థులు తమ తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. 


బీహార్‌లోని జాముయ్‌ జిల్లాలో ఒక కోచింగ్‌ సెంటర్‌‌లో శిక్షణ తీసుకుంటున్న బాలిక గతంలో ఓ అబ్బాయిపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆ కుర్రాడు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఆ బాలికపై ఆ కుర్రాడు ఆగ్రహం పెంచుకున్నాడు. ఆమెను దారుణంగా అవమానించేందుకు పథకం వేశాడు. ఆ బాలిక కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా తన ఐదుగురు స్నేహితులతో కలిసి మాటు వేశాడు. ఆ ఐదుగురితో కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 


ఆ ఐదుగురు విద్యార్థులు ఆ బాలిక చదువుతున్న కోచింగ్ సెంటర్‌కు చెందిన వారే. తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!