-
-
Home » Prathyekam » after marriage bride abscond from home in madhya pradesh prvn spl-MRGS-Prathyekam
-
పెళ్లయిన మర్నాడే పిరియడ్స్ అంటూ హనీమూన్‌ను వాయిదా వేసిన నవవధువు.. సరిగ్గా ఏడో రోజు ఊహించని సీన్..!
ABN , First Publish Date - 2022-05-12T00:01:20+05:30 IST
యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో.. వారిద్దిరికీ కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అనంతరం నూతనవధువు భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో వరుడి కుటుంబ

ఇంటర్నెట్ డెస్క్: యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో.. వారిద్దిరికీ కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అనంతరం నూతనవధువు భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో వరుడి కుటుంబ సభ్యులు వధూవరుల కోసం హనీమూన్ ప్లాన్ చేశారు. అయితే నూతన పెళ్లి కూతురు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పిరియడ్స్ పేరుతో హనీమూన్‌ను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సరిగ్గా ఏడు రోజులకు వరుడితోపాటు అతడి కుటుంబ సభ్యులకు ఆమె షాకిచ్చింది. స్థానికంగా ప్రస్తుతం చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అనే యువకుడికి చత్తీస్‌ఘడ్‌కు చెందిన లలిత అనే యువతి నచ్చింది. ఆమెకు కూడా అతడు నచ్చడంతో పెళ్లికి ఓకే చెప్పింది. లలిత కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎదురు కట్నం ఇచ్చిమరీ రాహుల్ ఆమెను కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వివాహానంతరం లిలిత అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే వరుడి కుటుంబ సభ్యులు.. నూతన దంపతునలు హనీమూన్ పంపించేందుకు ఏర్పట్లు మొదలు పెట్టారు. ఆ విషయం తెలిసి హనీమూన్ వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. పిరియడ్స్ కారణంగా ప్రోగ్రామ్‌ను కొన్ని రోజలు వాయిదా వేయాలని కోరింది.
ఆమె ఇబ్బంది గ్రహించి.. వరుడి కుటుంబ సభ్యులు హనీమూన్‌ను వాయిదా వేశారు. ఇది జరిగిన తర్వాత సరిగ్గా ఏడు రోజులకు ఇంట్లో ఉన్న నగలు, డబ్బుతో వధువు పరారైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ కుటుంబ సభ్యులు.. ఆమెను తమకు పరిచయం చేసిన మధ్యవర్తి ఇంటికి వెళ్లారు. అనంతరం అక్కడ కనిపంచిన సీన్ చూసి నోరెళ్లబెట్టారు. మధ్యవర్తితో వధువు అసభ్యకర రీతిలో కనిపించడంతో కంగుతిన్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపేలోపే మధ్యవర్తితో కలిసి లలిత అక్కడ నుంచి కూడా పరారైంది.
చేసేదేమీ లేక రాహుల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధేశ్యామ్ అనే వ్యక్తి తమకు లలితను పరిచయం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా విధవ అని తెలిసీ ఎదురుకట్నం ఇచ్చి మరీ ఆమెను కోడలిగా చేసకున్నట్టు చెప్పారు. అయితే కొందరితో కలిసి రాధేశ్యామ్, లలిత తమను మోసం చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.