ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shraddha Walkar murder: జైలులో కుటుంబసభ్యులను కలిసేందుకు ఆఫ్తాబ్ నిరాకరణ

ABN, First Publish Date - 2022-12-21T05:34:30+05:30

శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు, జైలులో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన కుటుంబాన్ని కలవడానికి నిరాకరించాడని ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు, జైలులో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన కుటుంబాన్ని కలవడానికి నిరాకరించాడని తీహార్ జైలు అధికారులు చెప్పారు.(Aaftab Poonawala)‘‘తోటి ఖైదీలతో ఆఫ్తాబ్ చాలా తక్కువగా మాట్లాడుతున్నాడని జైలు అధికారులు పేర్కొన్నారు. ఆఫ్తాబ్ తన జైలు సెల్‌లో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నాడని, అతను ఎవరితోనూ కలవడం లేదని, మాట్లాడటానికి ఇష్ట పడటం లేదు’’ అని జైలు అధికారి ఒకరు తెలిపారు.(Aaftab refusing to meet his family)తన ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను హత్య చేసినట్లు(Shraddha Walkar murder) ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఆఫ్తాబ్ పూనావాలా ఇప్పటికీ జైలు సందర్శనకు వచ్చే తన కుటుంబసభ్యులు, స్నేహితుల పేర్ల జాబితాను సమర్పించలేదని తీహార్ జైలు అధికారులు చెప్పారు.

జైలు మాన్యువల్ ప్రకారం ప్రతి ఖైదీ తమ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను వారానికి రెండుసార్లు జైలు ఇంటర్వ్యూ గదిలో కలుసుకోవడానికి అనుమతిస్తారు.ఖైదీని ఎవరైనా బయటి వ్యక్తిని కలవడానికి అనుమతించే ముందు జైలు సూపరింటెండెంట్ కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లను తీసుకొని వారానికి రెండుసార్లు జైలుకు వచ్చేందుకు రాతపూర్వకంగా అనుమతి ఇస్తారు.జైలులో ఫోన్‌ను రోజుకు రెండుసార్లు ఐదు నిమిషాల పాటు ఉపయోగించడానికి అనుమతిస్తారు. దీని కోసం, ఖైదీ తప్పనిసరిగా వారి పరిచయాల ఫోన్ నంబర్లను పంచుకొని, అఫిడవిట్‌పై సంతకం చేయాలి.

ఆఫ్తాబ్ తనను కలిసేందుకు కుటుంబసభ్యులు, స్నేహితుల పేర్లను జైలు సూపరింటెండెంట్ కు ఇవ్వలేదు.జైలు గదిలోనే ఎవరితో మాట్లాడకుండా, ఎవరినీ కలవకుండా ముభావంగా పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నాడని జైలు అధికారులు వివరించారు.అమెరికన్ రచయిత పాల్ థెరౌక్స్ ట్రావెల్‌లాగ్ అయిన ది గ్రేట్ రైల్వే బజార్‌ పుస్తకాన్ని జైలు అధికారులు ఆఫ్తాబ్ కు ఇచ్చారు. మరిన్ని ఆంగ్ల నవలలు ఇవ్వాలని ఆఫ్తాబ్ కోరినట్లు తీహార్ జైలు అధికారులు చెప్పారు.

Updated Date - 2022-12-21T08:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising