మూడ్రోజుల్లో ప్రేయసికి పెళ్లనగా సొంతూరికి వచ్చిన యువకుడు.. పెళ్లయిన మర్నాడే పక్కా ప్లాన్‌తో..

ABN , First Publish Date - 2022-05-06T21:18:11+05:30 IST

ఆ యువకుడు ఇంటికి దూరంగా ఉంటూ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతికి పెళ్లి ఫిక్సైందని అతడికి తెలిసింది. మరో మూడు రోజుల్లో ప్రేయసికి పెళ్లనగా అతడు తన

మూడ్రోజుల్లో ప్రేయసికి పెళ్లనగా సొంతూరికి వచ్చిన యువకుడు.. పెళ్లయిన మర్నాడే పక్కా ప్లాన్‌తో..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువకుడు ఇంటికి దూరంగా ఉంటూ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతికి పెళ్లి ఫిక్సైందని అతడికి తెలిసింది. మరో మూడు రోజుల్లో ప్రేయసికి పెళ్లనగా అతడు తన సొంతూరుకి చేరుకున్నాడు. ఆమెకు పెళ్లైన మార్నాడే పక్కా ప్లాన్‌తో అతడు దారుణానికి పాల్పడ్డాడు. కాగా.. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..


ఒడిస్సాలోని సోరో ప్రాంతానికి చెందిన ప్రదీప్ మాలీక్ గుజరాత్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయికి పెళ్లని తెలిసి అతడు తన సొంతూరుకు చేరుకున్నాడు. అనంతరం ఆ యువతితో మాట్లాడేందుకు మూడు రోజులపాటు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అది వీలుపడలేదు. ఈ క్రమంలోనే పెద్దలు చూసిన అబ్బాయితో ఆ యువతి పెళ్లి కూడా జరిగిపోయింది. అది చూసి ప్రదీప్ మాలీక్ తట్టుకోలేకపోయాడు. తీవ్ర ఉద్వేగానికి లోనై.. మద్యం సీసా, తాడు తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. మద్యం సేవించిన తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్న ఓ చెట్టుకు  ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ప్రదీప్ మాలీక్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ప్రదీప్ మాలీక్ చనిపోయినట్లు వెల్లడించారు. కాగా.. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 


Read more