ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

భార్యాపిల్లలను ఆటోలో కూర్చోమన్నాడా భర్త.. ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అనుకుని ఎక్కారు.. మరుక్షణమే ఘోరం..!

ABN, First Publish Date - 2022-05-06T22:04:58+05:30

అతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ క్రమంలో తాజాగా అతడు తన భార్య పిల్లలను ఇంటి నుంచి బయటకు పిలిచాడు. అందర్నీ తన ఆటోలో కూర్చొమన్నాడు. అతడి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: అతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ క్రమంలో తాజాగా అతడు తన భార్య పిల్లలను ఇంటి నుంచి బయటకు పిలిచాడు. అందర్నీ తన ఆటోలో కూర్చొమన్నాడు. అతడి మాటలతో భార్య పిల్లలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమను ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అని భావించి, అతడు చెప్పినట్టే ఆటో ఎక్కేశారు. ఆ మరుక్షణమే ఘోరం జరిగిపోయింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన మహ్మద్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆ దంపతులు ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో మహ్మద్ మే 5న తన భార్యబిడ్డలను ఇంటి నుంచి బయటకు పిలిచాడు. అందర్నీ ఆటోలో కూర్చోమని చెప్పాడు. దీంతో తమను ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అని భావించిన ఆ భార్యబిడ్డలు.. మారు మాట్లాడకుండా మహ్మద్ చెప్పినట్టే చేశారు. ఆటోలో ఎక్కి కూర్చున్నారు. అనంతరం అతడు దారుణానికి పాల్పడ్డాడు. భార్యపిల్లలు ఎక్కిన ఆటోకు నిప్పటించి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 



ఈ దుర్ఘటనలో మహ్మద్‌, అతడి భార్య, 9ఏళ్ల కూతురు ప్రాణాలు కోల్పోగా.. 5 ఏళ్ల చిన్నారి మాత్రం తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అధికారులు.. పోక్సో కేసులో మహ్మద్‌ నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కేరళలో మార్చి 19న కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా హమీద్ అనే వ్యక్తి తన కొడుకు, కోడలు, వారి పిల్లలను ఇంట్లో బంధించి ఇంటికి నిప్పటించాడు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!