ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Viral News: తాగితే కిక్కెక్కలేదని కోర్టుకెక్కిన 42ఏళ్ల వ్యక్తి

ABN, First Publish Date - 2022-05-08T22:42:25+05:30

మద్యాన్ని కల్తీ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఏకంగా consumer court‌ను ఆశ్రయించేందుకు రెడీ అయ్యాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని అతడు రాష్ట్ర హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి దృష్టికి కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: మద్యాన్ని కల్తీ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఏకంగా consumer court‌ను ఆశ్రయించేందుకు రెడీ అయ్యాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని అతడు రాష్ట్ర హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని బహదూర్ గంజ్ ప్రాంతానికి చెందిన లోకేష్ సోతియా అనే వ్యక్తికి ప్రస్తుతం 42ఏళ్లు. ఇతడికి మద్యం సేవించే అలవాటు ఉంది. గత 20ఏళ్లుగా మద్యం తాగుతున్న లోకేష్.. ఏప్రిల్ 12న స్థానికంగా ఉన్న ఓ వైన్స్‌కు వెళ్లి అక్కడ రెండు మద్యం బాటిళ్లను కొనుగోలు చేశాడు. అనంతరం మద్యాన్ని తన స్నేహితుడితో కలిసి సేవించాడు. అయితే రెండు బాటిళ్ల మద్యం తాగినా వారికి కిక్కెక్కలేదు. దీంతో లోకేష్ కంగుతిన్నాడు. అంతే.. కల్తీ మద్యం విక్రయించినట్టు గ్రహించిన అతడు.. సదరు మద్యం దుకాణంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఎక్సైజ్ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు. 



కాగా.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మద్యం దుకాణానికి వ్యతిరేకంగా వినియోగదారుల కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పాడు. వైన్‌షాపులో మద్యంలో నీళ్లు కలుపుతున్నారని నిరూపించడానికి ఆధారాలను సిద్ధం చేసుకున్నట్టు తెలిపాడు. 20ఏళ్లుగా మద్యం సేవిస్తుండటం వల్ల కల్తీ జరిగింది లేనిదీ తనకు ఇట్టే తెలుస్తుందని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!