ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇంటర్ కుర్రాడు.. ఆమె బీఏ పాస్.. ఎన్నిసార్లు అడిగినా పెళ్లికి అతడు ఒప్పుకోవడం లేదని ఆమె ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-05-12T01:45:14+05:30

చూడగానే ఆమెకు అతడు నచ్చేశాడు. దీంతో నేరుగా వెళ్లి అతడికి ప్రపోజ్ చేసేసింది. పెళ్లి చేసుకోమని అడిగింది. అయితే ఆమెకు అతడు షాకిచ్చాడు. పెళ్లి చేసుకునే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పేశాడు. ఎన్నిసార్లు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: చూడగానే ఆమెకు అతడు నచ్చేశాడు. దీంతో నేరుగా వెళ్లి అతడికి ప్రపోజ్ చేసేసింది. పెళ్లి చేసుకోమని అడిగింది. అయితే ఆమెకు అతడు షాకిచ్చాడు. పెళ్లి చేసుకునే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పేశాడు. ఎన్నిసార్లు అడిగినా అతడి నుంచి అదే సమాధానం వస్తుండటంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌లోని మోరీనా జిల్లాకు చెందని 22ఏళ్ల యువతి నవ్లేష్ కుశ్వాహ అనే యువకుడిని చూసి ఇష్టపడింది. ఈ క్రమంలోనే అతడి వద్దకు వెళ్లి తన ప్రేమను వ్యక్త పరిచింది. పెళ్లి చేసుకోమని అడిగింది. అయితే అందుకు నవ్లేష్ నిరాకరించాడు. అయినప్పటికీ ఆమె తన పట్టు విడవలేదు. తనను పెళ్లి చేసుకోమని పదే పదే అతడి వెంట పడింది. అయినా అతడు తన మనసు మార్చుకోలేదు. ఈ క్రమంలో ఆ యువతి తన ప్రేమ గురించి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. నవ్లేష్‌ది కూడా తమ సామాజిక వర్గమే కావడంతో యువతి ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. అంతేకాకుండా ఊరి పెద్దల సమక్షంలో నవ్లేష్ కుటుంబ సభ్యులను పిలిచి.. పెళ్లి గురించి మాట్లాడారు. 



అప్పుడు కూడా అతడు తన మాట మీదే నిలబడి ఉన్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి.. తిండీ మానేసింది. కనీసం నీళ్లను కూడా తాగకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు నవ్లేష్‌పై దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా ఆ యువతి కూడా బెదిరింపులకు పాల్పడటంతో అతడు భయాందోళనలకు లోనయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంటర్ వరకే చదివానని.. ఆ యువతి మాత్రం డిగ్రీ‌లో ఉత్తీర్ణత సాధించిందని అందువల్ల ఆమెను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు. అయితే ఈ విషయంలో యువతి, సహా ఆమె కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడుతన్నారని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!