ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రైల్లో టాయ్‌లెట్‌‌కు వెళ్లిన యువతి.. ఎన్ని సార్లు పిలిచినా నో రెస్పాన్స్.. రైల్వే సిబ్బంది వచ్చి తలుపులు తీసి చూస్తే..

ABN, First Publish Date - 2022-05-09T21:40:37+05:30

ఆమె వయసు 20ఏళ్లు. రైల్లో ప్రయాణిస్తూ వాష్‌రూమ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన యువతి ఎంతకూ బయటకు రాలేదు. ఇతర ప్రయాణికులు వాష్‌రూమ్ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుంచి ఉలుకూ పలుకూ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: ఆమె వయసు 20ఏళ్లు. రైల్లో ప్రయాణిస్తూ వాష్‌రూమ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన యువతి ఎంతకూ బయటకు రాలేదు. ఇతర ప్రయాణికులు వాష్‌రూమ్ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుంచి ఉలుకూ పలుకూ లేదు. విషయం కాస్తా రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. రైల్వే సిబ్బంది వచ్చి.. ఎట్టకేలకు తలుపులు ఓపెన్ చేశారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. ఇందుకు సంబంధంచిన పూర్తి వివరాల్లోకి వెళితే..



బంద్ర-వైష్ణోదేవి కత్రా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్న 20ఏళ్ల యువతి వాష్‌రూమ్‌కు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. తోటి ప్రయాణికులు టాయ్‌లెట్ వద్దకు వెళ్లి పిలిచినా ఫలితం లేకపోవడంతో విషయాన్ని టీసీకి చెప్పారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారి.. డోర్ ఓపెన్ చేయాల్సిందిగా పలుమార్లు కోరాడు. ఎన్ని సార్లు పిలిచినా లోపల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో సదరు అధికారి అసహనం వ్యక్తం చేశాడు. రైలు  Dahanu station‌కు చేరిన తర్వాత విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు. దీంతో అధికారులు ఎట్టకేలకు బాత్‌రూమ్ తలుపులు ఓపెన్ చేశారు. ఈ క్రమంలో 20ఏళ్ల యువతి బాత్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా ఉరికి వేలాడాన్ని చూసి షాకయ్యారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకండా ఆమె బ్యాగులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ఆమెను ఆర్తీ కుమారిగా గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!