ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బాయ్‌ఫ్రెండ్‌కు తెలీకుండా అతడి కండోమ్‌కు చిల్లులు పెట్టిన మహిళ.. కోర్టుకెక్కిన బాధితుడు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-05-09T01:04:59+05:30

తన సహచరుడికి తెలీకుండా అతడి కండోమ్‌కు(condom) చిల్లులు పెట్టిన మహిళ.. లైంగిక దాడికి పాల్పడిందంటూ జర్మనీలోని ఓ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: తన సహచరుడికి తెలీకుండా అతడి కండోమ్‌కు(condom) చిల్లులు పెట్టిన మహిళ..అతడిపై లైంగిక దాడికి పాల్పడిందని జర్మనీలోని ఓ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.  నిందితురాలికి ఆరు నెలల సస్పెండెడ్ సెంటెన్స్ కూడా విధించింది.  భాగస్వామికి చెప్పకుండా ఇలా చేయడమంటే లైంగిక దాడికి పాల్పడినట్టేనని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జర్మనీ న్యాయ చరిత్రలో ఈ కేసు చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా పేర్కొన్నారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. బియల్‌ఫీల్డ్ నగరానికి చెందిన 39 ఏళ్ల మహిళకు గతేడాది ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే.. వారిద్దరూ తాము స్నేహితులుగా ఉంటూనే లైంగిక వాంఛలు తీర్చుకోవాలనుకున్నారు. ప్రేమ, పెళ్లి లాంటి బంధాల్లోకి పడొద్దనుకున్నారు.


ఇలా వారి బంధం సాగుతుండగా.. మహిళకు అతడి పట్ల ప్రేమ పెరిగింది. అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె అతడికి తెలీకుండా అతడి కండోమ్‌కు చిల్లులు పెట్టింది. ఈ కారణంగా గర్భం దాల్చితే..అతడితో బంధం శాశ్వతమవుతుందనేది ఆమె ప్లాన్. కానీ, ఆమె ప్రయత్నాలు ఎంతకీ  ఫలించకపోవడంతో ఇటీవల ఓ రోజు ఆమె అతడికి వాట్సాప్ మెసేజ్ చేసింది. తాను గర్భవతి అయ్యిండొచ్చంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే.. అతడి కండోమ్‌కు చిల్లులు పెట్టిన విషయాన్ని కూడా బటయ పెట్టింది. దీంతో.. షాకైపోయిన బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.


అయితే.. మొదట్లో న్యాయమూర్తికి కూడా ఈ కేసును ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదు. ఆమెపై ఏయే అభియోగాల కింద కేసు నమోదు చేయాలో అర్థం కాక తికమక పడ్డారు. ఆమెపై అత్యాచారం కేసు పెట్టాలని కూడా భావించారు. అయితే.. న్యాయమూర్తి దృష్టి స్టెల్తింగ్‌పై పడింది. శృంగార సమయంలో మహిళకు తెలీకుండా కండోమ్ తొలగించడాన్ని స్టెల్తింగ్‌ అంటారు. న్యాయశాస్త్రం ప్రకారం ఇది క్రమినల్ చర్య. కానీ.. తొలిసారిగా ఓ పురుషుడు ఈ నేరానికి బాధితుడయ్యాడు. ఇదో అరుదైన కేసుగా అభివర్ణించిన న్యాయమూర్తి.. అదే స్టెల్తింగ్ ప్రకారం ఆమె నేరం చేసినట్టేనని ఇటీవల తీర్పు వెలువరించారు. ఆమె తన భాగస్వామిపై లైంగిక దాడి చేసిందని తేల్చి చెప్పారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!