ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Viral Video: బిడ్డను ఎత్తుకుని.. ఓ కాలు పైకిలేపి... విమానంలో మహిళ వింత స్టంట్..

ABN, First Publish Date - 2022-05-15T00:30:57+05:30

వనితలకు ఒకేసారి పదిపనులు చక్కపెట్టగలిగే మల్టీటాస్కింగ్ సామర్థ్యం కూడా ఎక్కువే..! అలాంటి ఓ మహిళ వీడియో ప్రస్తుతంసోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ఆమెది వించ చేష్ట అంటూ ఫైరవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: విహారయాత్రల్లో ఎంజాయ్ చేయాలంటే.. వీలైనంత తక్కువగా లగేజీని తీసుకెళ్లాలి. అప్పుడే.. ప్రశాంతంగా టూర్‌ను ఆస్వాదించొచ్చు. అయితే.. చిన్నపిలల్లతో.. ముఖ్యంగా నడవడం కూడా రాని చిన్నారులతో టూర్లు వేయడం మామూలు విషయం కాదు. వారిని ఓ కంటకనిపెడుతూనే లగేజీని కూడా తీసుకెళ్లాల్సింది ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇలాంటి సందర్భాల్లో కాస్తంత ఇబ్బందే..! అయితే.. వనితలకు ఒకేసారి పదిపనులు చక్కపెట్టగలిగే మల్టీటాస్కింగ్ సామర్థ్యం కూడా ఎక్కువే..! అలాంటి ఓ మహిళ వీడియో ప్రస్తుతంసోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ఆమెది వింత చేష్ట అంటూ ఫైరవుతున్నారు. పబ్లిసిటీ యావ ఎక్కువని ఆరోపిస్తున్నారు! ఈ ఘటన తాలూకు పూర్తి వివరాల్లోకి వెళితే.. 


విమానం ల్యాండయ్యాక మహిళ తన లగేజీ తీసుకునే సందర్భంలో రికార్డు చేసిన వీడియో ఇది. దీన్ని ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో.. మహిళ బిడ్డను ఎత్తుకుని.. సీటుపై క్యాబిన్‌లో ఉన్న పెట్టేను కిందకు దించుతుంది. ఆ తరువాత.. సూట్‌కేసు ఓ చేతిలో పుట్టుని..మరోవైపు బిడ్డను బ్యాలెన్స్ చూస్తూనే ఓ కాలిని పైకెత్తి క్యాబిన్ డోర్ మూసేస్తుంది. ఇది ఇలా అసాధారణ రీతిలో ఆమె తలుపు మూయడమే నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకు 2.1 లక్షల వ్యూస్, 6500 పైచిలుకు లైక్స్ వచ్చాయంటే వీడియోకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అధికాశాతం నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మల్టీటాస్కింగ్ అంటే అదీ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. కానీ.. కొందరికి మాత్రం ఆమె చేసింది అస్సలు నచ్చలేదు. ఈ విషయాన్ని కాస్తంత ఘాటుగానే చెబుతున్నారు. ‘‘పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేసింది.. లగేజీ కిందకు దించాక క్యాబిన్ డోర్‌ను ఇలా ఎవ్వరూ మూయరు’’ అని కామెంట్ చేశారు. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.. ! 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!