Bride groom set on fire: పెళ్లయిన వెంటనే తమ శరీరాలకు నిప్పంటించుకున్న జంట.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2022-05-14T00:26:06+05:30 IST
జీవితంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టే.. నేటి తరం ఈ వేడుకను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటున్నారు. ఇక అమెరికాకు చెందిన ఓ జంట.. తమ వివాహ రిసెష్పన్ పూర్తయ్యాక తమకు తాము నిప్పంటించుకున్నారు.

ఎన్నారై డెస్క్: జీవితంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టే.. నేటి తరం ఈ వేడుకను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటున్నారు. ఇక అమెరికాకు చెందిన ఓ జంట.. తమ వివాహ రిసెష్పన్ పూర్తయ్యాక తమకు తాము నిప్పంటించుకున్నారు. వారిని మంటలు చుట్టుముడుతున్నా లెక్క చేయకుండా నవ్వుతూ నడుచుకుంటూ వెళ్లిపోయారు. వివాహానికి వచ్చిన గెస్టులందరూ ఈ తతంగం చూసి ఒక్కసారిగా షాకైపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో కూడా తెగ వైరల్ అవుతూ.. నెటిజన్లతో గగ్గోలు పెట్టిస్తోంది. అసలు ఈ జంట ఎవరు..? తమకు తాము ఎందుకు నిప్పంటించుకోవాల్సి వచ్చింది..? ఇప్పుడు వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనం చదవాల్సిందే..
గేబ్ జెస్సప్, యాంబిర్ బాంబిర్ ఇద్దరూ హాలివుడ్లో స్టంట్ డబుల్స్‌గా చేస్తుంటారు. హీరో హీరోయిన్లకు బదులుగా ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన అనుభవం వారిది. ఇటీవలే వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే.. తమ వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ఆ ఇద్దరూ అనుకున్నారు. స్టంట్ మాస్టర్లుగా తమ అనుభవాన్నంతా ఉపయోగించి.. ఓ పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నారు. పెళ్లి రిసెష్పన్ పూర్తయ్యాక తమ పథకాన్ని అమలు చేశారు. అక్కడి వివాహ సంప్రదాయం ప్రకారం.. రిసెష్పన్ తరువాత వధూవరులు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకుని వేదిక విడిచి వెళ్లిపోవాలి(wedding exit). ఈ క్రమంలోనే ఆ జంట తమ స్టంట్‌కు తెరలేపింది. ప్లాన్ ప్రకారం.. మరో వ్యక్తి సాయంతో వారు నిప్పంటించుకున్నారు. చూస్తుండగానే వాళ్ల ఒళ్లంతా మంటలు వ్యాపించాయి. ఇవేమీ లెక్కచేయకుండా.. వారు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి సరదాగా నవ్వుకుంటూ రిసెష్షన్ వేదికను వీడారు. కొంతదూరం వెళ్లాక.. అక్కడున్న మరికొందరు వారి మంటలను ఆర్పేశారు.
కాగా.. ఈ వెరైటీ Wedding exit ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ జంటకు ఏమైందోనని కొందరు కంగారు పడినప్పటికీ.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఇద్దరూ స్టంట్ మాస్టర్లు అవడంతో ఇలా చేశారని తెలిసి అవాక్కయ్యారు. వధువు జుట్టు మంటల్లో కాలిపోయిందని కొందరు సందేహం వ్యక్తం చేయగా.. ఆమె విగ్ పెట్టుకుందని జంట క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా.. జుట్టుకు కాలిపోకుండా.. ఓ రకమైన జల్ కూడా రాసుకున్నామని వారు చెప్పుకొచ్చారు. వారి స్టంట్‌కు సంబంధించిన ఇన్‌స్టా వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.