UAEలో కొత్తగా అమల్లోకి కీలక మార్పు.. గుడ్ న్యూస్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-11-07T12:35:47+05:30 IST

UAE కొద్ది రోజుల క్రితం వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. ఆ నిబంధనలు అక్టోబర్ 3 నుంచే అమలులోకి వచ్చాయి కూడా. ఈ క్రమంలో వీసా నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు..

UAEలో కొత్తగా అమల్లోకి కీలక మార్పు.. గుడ్ న్యూస్ ఏంటంటే..

ఎన్నారై డెస్క్: UAE కొద్ది రోజుల క్రితం వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. ఆ నిబంధనలు అక్టోబర్ 3 నుంచే అమలులోకి వచ్చాయి కూడా. ఈ క్రమంలో వీసా నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు కొంత మేర ఉపశమనం లభించింది. ఇంతకూ విషయం ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉద్యోగం, ఉపాధి కోసం ప్రతి రోజూ వేలాది మంది భారతీయులు UAE వెళ్తుంటారు. అలా వెళ్లిన వాళ్లు కొన్నేళ్లపాటు అక్కడే గడుపుతుంటారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో గడపాలనే ఉద్దేశంతో టూరిస్ట్ వీసాలపై కుటుంబ సభ్యులను అక్కడకు రప్పించుకుంటూ ఉంటారు. అలా యూఏఈకి వెళ్లిన ప్రవాసుల కుటుంబ సభ్యులు వీసా గడువు దాటినప్పటికీ కొన్ని సందర్భాల్లో తెలిసీ తెలియక అక్కడే ఉండిపోతుంటారు. ముఖ్యంగా ఇలా టూరిస్ట్ వీసాలపై వచ్చి గడువు దాటినా యూఏఈలోనే ఉండిపోయే(Overstay) వారికి యూఏఈ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకుంది. Tourism visa గడువు దాటిన తర్వాత కూడా యూఏఈలో నివసించే వారి వద్ద నుంచి మొన్నటి వరకు రోజుకు 100 దిర్హమ్‌‌ల చొప్పున జరిమానా విధించేది. అయితే ప్రస్తుతం Overstay ఫైన్‌ను ఇప్పుడు 50 దిర్హమ్‌లకు తగ్గించింది. ఇదే సమయంలో రెసిడెన్సీ పర్మిట్‌ల విషయంలో ఈ ఫైన్‌ను 25 దిర్హమ్‌ల నుంచి 50దిర్హమ్‌లకు పెంచింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు కూడా ధ్రువీకరించారు. అన్ని రకాల వీసా ఓవర్ స్టే(Overstay) ఫైన్‌లను 50దిర్హమ్‌ల క్రమబద్ధీకరించినట్టు వెల్లడించారు. ఈ జరిమానాలను సంబంధిత ప్రభుత్వ కారాలయాల్లోకానీ వెబ్‌సైట్/అప్టికేషన్‌ల ద్వారా కానీ చెల్లించొచ్చని పేర్కొన్నారు.

ఉల్లంఘించిన

Updated Date - 2022-11-07T13:00:00+05:30 IST

Read more