ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కెనడాలో TACA ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు!

ABN, First Publish Date - 2022-05-10T01:35:32+05:30

కెనడాలో తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) మే 7న రంజాన్ పండుగ ఇఫ్తార్‌ విందును మిస్సిసాగ నగరంలోని మేపిల్ కన్వెన్షన్ సెంటర్ వేదిక నందు వైభవంగా నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కెనడాలో తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా (తాకా)  మే 7న రంజాన్ పండుగ ఇఫ్తార్‌ విందును మిస్సిసాగ నగరంలోని మేపిల్ కన్వెన్షన్ సెంటర్ వేదిక నందు వైభవంగా నిర్వహించింది. కెనడాలోని 150 మందికి పైగా తెలుగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఖాజిల్ మహమ్మద్, విద్య భవనం,షెరీన్ షాయిరాజ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.  మొదటగా కెనడా మరియు భారత దేశ జాతీయ గీతాల్ని ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మిస్సిసాగ మాల్టన్ నుండి శ్రీ దీపక్ ఆనంద్  ముఖ్య అతిథిగా విచ్చేసారు. రంజాన్ పండుగ విశిష్టత గురించి వివరించిన దీపక్.. టొరంటోలోని తెలుగు కమ్యూనిటీ కోసం తాకా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. తాకా కార్యవర్గం శ్రీ  దీపక్ ఆనంద్‌ను  సత్కరించి మొమెంటోను అందజేశారు.


ఈ కార్యక్రమం..  నాలుగు గంటల పాటు దాదాపు 15 పైగా రంజాన్ పాటలు, గజల్స్, గేమ్స్, ఇతర సాంస్కృతిక  కార్యక్రమాలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. షేక్ సదిఖ్  గజల్స్, రియాజ్ అలీ దుర్యోధన ఏకపాత్రాభినయం, షహీరాజ్, రిచా శర్మ, రీనా శర్మాల సినీ గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. జావేద్, అఫ్రిన్, షెరీన్, ముంతాజ్, జహా రంజాన్ ప్రార్థన విశిష్టతను వివరించారు. 

తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, వ్యవస్థాపక సభ్యులు చారి సామంతపూడి, శ్రీనాథ్ కుందూరి, ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, మాజీ ట్రస్టీ చైర్మన్ బాషా షేక్ తాకా వ్యవస్థాపకత, తాకా చేస్తున్న కార్యక్రమాలు వివరించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 


ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల,రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భవనం, ఖాజిల్ మహమ్మద్, బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి,  శ్రీనాథ్  కుందూరు, రామ చంద్ర రావు దుగ్గిన, ఇతర వలంటీర్లు అందరిని తాకా అధ్యక్షుడు కల్పన మోటూరి అభినందించారు. చివరగా మాజీ ట్రస్టీ చైర్మన్ బాషా షైక్..  కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, దాతలకు, అతిథులకు ఇచ్చిన వందన సమర్పణతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.






             ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!