అమెరికాలో రికార్డు సృష్టించిన Sarkaruvaari paata

ABN , First Publish Date - 2022-05-09T01:56:16+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ Sarkaruvaari paata. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి

అమెరికాలో రికార్డు సృష్టించిన Sarkaruvaari paata

ఓవర్సిస్ సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ Sarkaruvaari paata. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో 603 కంటే ఎక్కువ లొకేషన్స్‌లో విడుదలకు సిద్ధమైన ఈ మూవీ భారీ మొత్తంలో కలెక్షన్లు రాబడుతోంది. ఈ నెల 11న యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడనుండగా.. ప్రీమియర్స్‌కు నాలుగు రోజుల ముందే ప్రీ సేల్స్ ద్వారా 305k డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించినట్లు సమాచారం. ఈ మూవీని అక్కడ ఫ్లైహై సినిమాస్, శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్, క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా విడుదల చేస్తుండగా.. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారం చేపట్టాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ స్కామ్ వంటి డిఫరెంట్ కథాంశంతో మూవీ తెరకెక్కింది.


Read more