SVP: యూఎస్‌లో Premieres ద్వారా ఎంత కొల్లగొట్టిందంటే..

ABN , First Publish Date - 2022-05-12T16:01:45+05:30 IST

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు పరశురామ్ కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata).

SVP: యూఎస్‌లో Premieres ద్వారా ఎంత కొల్లగొట్టిందంటే..

ఓవర్సీస్ సినిమా: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు పరశురామ్ కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata). నేడు(గురువారం) ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ భారీగా విడుదలైంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిపోయాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో ‘సర్కారువారి పాట’ ప్రీమియర్స్ బుధవారమే పడ్డాయి. దీంతో ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ అక్కడ 8లక్షల డాలర్ల(రూ.6.20కోట్లు) గ్రాస్‌ను రాబట్టింది. ఈ మేరకు SVP ను అక్కడ విడుదల చేసిన ఫ్లైహై సినిమాస్, శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్, క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ట్విటర్ ద్వారా వెల్లడించాయి.


ఇక ఈ చిత్రం అగ్రరాజ్యంలో సుమారు 603 పైచిలుకు లొకేషన్స్‌లో విడుదలైంది. మహేశ్ కెరీర్‌లోనే యూఎస్‌లో ఇంత భారీగా విడుదలవడం ఇదే తొలిసారి. బ్యాంకింగ్ స్కామ్ వంటి డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి ప్రిన్స్ పక్కన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సుబ్బ‌రాజు, న‌దియా, త‌నికెళ్ల భ‌ర‌ణి  త‌దిత‌రులు ఇతర కీలక పాత్ర‌ల్లో నటించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్, ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ తర్వాత పరశురామ్ చేస్తున్న చిత్రం కావడంతో Sarkaruvaari paata పై బాగా హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగా మూవీ ఉందా? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 



Updated Date - 2022-05-12T16:01:45+05:30 IST

Read more