ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Kuwait లోని Indian Embassy ఓపెన్ హౌస్ మీటింగ్..

ABN, First Publish Date - 2022-05-10T16:50:53+05:30

కువైత్‌లోని భారత ఎంబసీ బుధవారం(మే 11) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత ఎంబసీ బుధవారం(మే 11) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. భారత రాయబారి సిబి జార్జ్‌ ఈ కార్యక్రమం ద్వారా కువైత్‌లోని భారత ప్రవాసుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చిస్తారు. ఫహహీల్‌లోని బీఎల్‌ఎస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌లో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల(కువైత్ కాలమానం ప్రకారం) వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కువైత్‌లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం లేదని ఎంబసీ వెల్లడించింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఫహహీల్‌లోని బీఎల్‌ఎస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైత్‌లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన amboff.kuwait@mea.gov.in కు ఈ-మెయిల్ చేయాలి. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!