ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Dubai Duty Free: జీవితంలో ఒక్కసారి లాటరీ తగిలితే చాలనుకునేవారు కోకొల్లలు.. కానీ ఈ భారత ప్రవాసుడికి మాత్రం రెండేళ్లలోనే..

ABN, First Publish Date - 2022-05-12T14:37:11+05:30

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

దుబాయ్: అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఇలా జీవితంలో ఒక్కసారి లాటరీ తగిలితే చాలు అనుకునే వారు కోకొలల్లలు. ఇక అలాంటి వారికి లాటరీ తగిలితే.. నిన్నటివరకు సాదాసీదా జీవితం గడిపినవారు రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు. అలాంటి అదృష్టమే తాజాగా భారత ప్రవాసుడికి వరించింది. Dubai Duty Free Millennium Millionaire draw లో సునీల్ శ్రీధరన్ అనే భారత వ్యక్తి ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ.6.50కోట్లు) గెలుచుకున్నాడు. అయితే, శ్రీధరన్‌ ఇలా వన్ మిలియన్ డాలర్లు గెలవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2019లో తొలిసారి మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే మనోడికి రెండుసార్లు జాక్‌పాట్ తగిలిందన్నమాట. కాగా, ఇప్పటివరకు ఇలా మిలీనియం మిలియనీర్ డ్రాలో రెండుసార్లు విజేతలుగా నిలిచిన వారిలో శ్రీధరన్ ఎనిమిదో వ్యక్తి అని రాఫెల్ నిర్వాహకులు వెల్లడించారు.   


ఇక బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన Dubai Duty Free డ్రాలో శ్రీధరన్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 10వ తేదీన అతడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ 388, లాటరీ టికెట్ నం.1938 శ్రీధరన్‌కు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీంతో రాత్రికి రాత్రే అతడి బ్యాంక్ ఖాతాలోకి రూ.6.50కోట్లు వచ్చిపడ్డాయి. దుబాయ్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ బిజినెస్ చేసే 55 ఏళ్ల శ్రీధరన్ 20 ఏళ్ల నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటానని తెలిపాడు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా, 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్‌లో 1మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుల్లో సునీల్ శ్రీధరన్ 188వ వ్యక్తి.     

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!