ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

NRI: నేషనల్ మెడికల్ కమిషన్ కఠిన నిబంధనలు..చైనా దృష్టికి తీసుకెళ్లిన భారత్

ABN, First Publish Date - 2022-11-07T23:33:20+05:30

చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయులకు సంబంధించి కఠిన నిబంధనల అంశాన్ని భారత ప్రభుత్వం చైనా దృష్టికి తీసుకెళ్లింది. భారత్‌లో ప్రాక్టీస్ ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన అనుమతి విషయాన్నీ అక్కడి అధికారులతో పంచుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయులకు సంబంధించి కఠిన నిబంధనల అంశాన్ని భారత ప్రభుత్వం చైనా దృష్టికి తీసుకెళ్లింది. భారత్‌లో ప్రాక్టీస్ ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన అనుమతి విషయాన్నీ అక్కడి అధికారులతో పంచుకుంది. ఈ కొత్త నిబంధనలన్నీ పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ చైనాకు విజ్ఞప్తి చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ఈ నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక చైనాలో మెడిసిన్ చదవాలనుకుంటున్న వారి కోసం చైనా రాజధాని బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ గత సెప్టెంబర్‌లో సవివరమైన సూచనలు జారీ చేసింది. చైనాలో తక్కువ పాస్ పర్సెంటేజీతో ఉత్తీర్ణులవడం వంటి సమస్యలను ప్రస్తావించింది. చైనా చదువు తరువాత భారత్‌లో ప్రాక్టీస్ చేసేందుకు కఠిన నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది.

అధికారిక అంచనాల ప్రకారం.. చైనాలో ప్రస్తుతం 23 వేల పైచిలుకు భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో అధిక శాతం వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా సంక్షోభం కారణంగా రెండేళ్ల పాటు వీసా ఆంక్షలు విధించిన చైనా..ఇటీవలే సడలింపులకు తెరతీసింది. భారతీయులకు కొత్త వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే..350 మంది చైనాలో మళ్లీ చదువులు ప్రారంభించేందుకు వెళ్లారని సమాచారం. ఇదిలా ఉంటే.. చైనా యూనివర్శిటీలు కొత్త సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దేశంలో అమలవుతున్న కఠిన నిబంధనల గురించి భారత్ చైనా దృష్టికి తీసుకెళ్లింది. భారతీయ విద్యార్థులకు అన్ని అంశాల్లో నిబంధనలకు అనుగూణంగా శిక్షణ ఇవ్వాలని సూచించింది.

Updated Date - 2022-11-07T23:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!