ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వాళ్లపై కాల్పులు జరపచ్చుగా.. ట్రంప్ షాకింగ్ సూచన..!

ABN, First Publish Date - 2022-05-03T23:54:22+05:30

పోలీసు కర్కశత్వానికి 2020లో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన ఘటన అమెరికాను కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఈ నిరసనల ధాటికి ఉక్కిరిబిక్కిరయ్యారు. నిరసనలను నియంత్రించేందుకు కాల్పులు జరపాలని ప్రతిపాదించారట.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: పోలీసు కర్కశత్వానికి 2020లో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన ఘటన అమెరికాను కుదిపేసిన విషయం తెలిసిందే. శ్వేతజాతీయుల జాత్యాహంకారమే దీనికి కారణమంటూ అప్పట్లో నల్లజాతీయులతో సహా అనేక మంది శ్వేతజాతీయేతరులు పెద్ద ఎత్తున నిరసనలకు తెరలేపారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ పేరిట భారీ ఉద్యమాన్ని నడిపి.. న్యాయం కోసం కదనుతొక్కారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఈ నిరసనల ధాటికి ఉక్కిరిబిక్కిరయ్యారు. నిరసనలు కట్టడి చేసేందుకు ట్రంప్ సైన్యాన్ని కూడా రంగంలోకి దింపాలనుకున్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా అమెరికా మాజీ డిఫెన్స్ సెక్రెటరీ మార్క్ ఎస్పర్(Mark Esper) ఇటీవల ఓ పుస్తకాన్ని రాశారు. ఇందులోని కొన్ని ముఖ్యభాగాలు సోమవారం విడులయ్యాయి. 


నిరసనలను నియంత్రించేందుకు కాల్పులు జరపితే ఎలా ఉంటుందని ట్రంప్ తనతో అన్నట్టు మార్క్ తన పుస్తకంలో బయటపెట్టారు. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతుండటంతో ట్రంప్‌ను బాగా ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నారు. ‘‘ఓవల్ ఆఫీసులో ఆయన చాలా చిరాకుపడుతూ కనిపించారు. వాళ్లపై కాల్పులు జరపచ్చుగా..? కాళ్లపై కాల్పులు జరిపి చెదరగొట్టచ్చుగా’’ అని ట్రంప్ పేర్కొన్నట్టు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఈ కథనం సంచలనానికి దారి తీస్తోంది. ఇక.. జర్నలిస్టు మైఖల్ బెండర్ కూడా గతంలో ట్రంప్ పాలనకు సంబంధించి ఓ సంచలనాత్మకు పుస్తకాన్ని వెలువరించారు. 


Black lives matter ఉద్యమాన్ని నియంత్రణలోకి తెచ్చేందుకు సైన్యాన్ని దింపాలని ట్రంప్ సూచించినట్టు అందులో పేర్కొన్నారు. కానీ.. అప్పటి అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మైలీ మాత్రం ఈ సూచనను తీవ్రంగా వ్యతిరేకించారట. ఈ విషయంలో ఆయన ట్రంప్‌తో వాగ్వాదానికి కూడా దిగారు. ఇక 2020లో వాషింగ్టన్‌లో చెలరేగిన నిరసనలు అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు, ఫ్లాష్‌బ్యాంగ్‌లను ప్రయోగించిన విషయం తెలిసిందే. 





సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!