ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Plane Catches Fire: చైనా విమానంలో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

ABN, First Publish Date - 2022-05-12T16:44:56+05:30

చైనాలో ఇటీవలే ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చాంగ్‌కింగ్: చైనాలో ఇటీవలే ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న కున్మింగ్‌ నుంచి గాంగ్‌ఝౌ వెళ్తున్న విమానం గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో 132 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనను మరకముందే తాజాగా ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈసారి తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ఘటనలో 25 మంది స్వల్పంగా గాయపడ్డారు. టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చాంగ్‌కింగ్ నుంచి నింగ్చి ప్రాంతానికి బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది. 


ఇక విమానంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను ఫ్లైట్ వెనుకవైపు ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు పంపించేశారు. ఈ ఘటనలో గాయపడిన 25 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఘటన అనంతరం టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ఇక విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!