ద్రవ్యోల్బణం కట్టడికి కార్పొరేట్ కంపెనీల పన్నుల వాటా పెరగాలన్న అమెరికా అధ్యక్షుడు Biden.. అమెజాన్ అధినేత రెస్పాన్స్ ఇదీ..

ABN , First Publish Date - 2022-05-14T23:01:07+05:30 IST

ద్రవ్యోల్బణం కట్టడికి అపరకుబేరుల పన్నుల వాటా పెంచాలన్న అమెరికా అధ్యక్షుడు.. అమెజాన్ అధినేత రెస్పాన్స్ ఇదీ..

ద్రవ్యోల్బణం కట్టడికి కార్పొరేట్ కంపెనీల పన్నుల వాటా పెరగాలన్న అమెరికా అధ్యక్షుడు Biden.. అమెజాన్ అధినేత రెస్పాన్స్ ఇదీ..

ఎన్నారై డెస్క్: ‘‘ద్రవ్యోల్బణం అదుపులోకి రావాలంటే.. కార్పొరేట్ కంపెనీలు న్యాయబద్ధంగా తమ వాటా పన్నులు చెల్లించాల్సిందే’’ ఇదీ అమెరికా అధ్యక్షుడో జోబైడెన్ ఇటీవల ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్య. ఇది విపరీతంగా వైరల్ అవుతుండటంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కూడా ఘాటుగా స్పందించారు. ‘‘కొత్తగా ఏర్పాటైన డిస్‌ఇన్ఫర్మేషన్(తప్పుడు సమాచార విచారణ)బోర్డు ఈ ట్వీట్‌ను సమీక్షించాలి. పన్నులు పెంచాలన్న ప్రతిపాదనపై చర్చించాల్సిందే. ద్రవ్యోల్బణం కట్టడిపై చర్చ కూడా అవసరమే. కానీ.. ఈ రెండిటినీ కలపడమంటే మాత్రం తప్పుదారి పట్టించడమే’’ అంటూ బెజోస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ సూటిగానే చెప్పారు. అగ్రరాజ్యాధినేతకు అమెజాన్ అధినేత ఇచ్చిన రెస్పాన్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 


కాగా.. అమెరికా ప్రజలు ప్రస్తుతం ధరల భారంతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అత్యవసరాలైన ఇంధనం, ఆహారం, వైద్యం, హౌసింగ్ ఖర్చులు పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికాలో 1980ల తరువాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే తొలిసారి. అయితే.. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దాదాపు ఎనిమిది నెలల తరువాత.. ఏప్రిల్‌లో తొలిసారిగా ద్రవ్యోల్బణం నెమ్మదించింది. ఇక.. వస్తుసేవలకు డిమాండ్ పెరగడం, జీతాలు, ముడిసరుకులు ఖర్చుల్లో పెరుగుదల, కరెన్సీ విలువలో కోత, ప్రభుత్వ విధానాలు ఆంక్షలు కలగలిసి ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతున్నాయని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. బెజోస్ స్థాపించిన అమెజాన్ 2017, 2018లో ఫెడరల్ ట్యాక్సు కింద ఒక్క డాలర్ కూడా కట్టలేదు. అయితే.. తమ వంతు వాటాను న్యాయబద్ధంగా అమెజాన్ చెల్లించడం లేదన్న ఆరోపణలను ఆ సంస్థ తొలి నుంచి ఖండిస్తూ వస్తోంది. తాము రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేస్తోంది. Read more