ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఇలా చేస్తే పిల్లల్లో అద్భుతమైన మార్పులు.. రుజువు చేసిన అమెరికా స్కూల్..

ABN, First Publish Date - 2022-12-05T20:58:46+05:30

క్యాంపస్ పరిసరాల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించిన అమెరికా పాఠశాల. ఈ నిర్ణయం తాలూకు ఫలితాలు స్కూల్ యాజమాన్యాన్నే ఆశ్చర్యపరిచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: స్మార్ట్ ఫోన్లు(Smart Phones) వచ్చాక ప్రజలు డిజిటల్ ప్రపంచంలో బిజీ అయిపోయారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఎవరి లోకం వారిదే! ఎంతగా అంటే.. ఎదురుగా ఉన్న వారితోనూ ముఖాముఖీ మాటలు కరువైపోయిన రోజులు వచ్చేశాయి. ఈ ధోరణి చిన్నారుల్లోనూ కనిపిస్తోంది. స్నేహితులు, ఆట పాటల మధ్య గడిచిపోవాల్సిన బాల్యం స్మార్ట్ ఫోన్‌ తెచ్చిన ఒంటరితనంలో మసకబారిపోతోంది. తోటివారితో కలిసిమెలిసి తిరగడం, ముఖాముఖీ మాట్లాడటం వంటి కనీస మెళకువలకూ వారు దూరమైపోతున్నారు. దీనికి పరిష్కారంగా అమెరికాలోని ఓ స్కూల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాంపస్ పరిసరాల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించింది. ఈ నిర్ణయం తాలూకు ఫలితాలు స్కూల్ యాజమాన్యాన్నే ఆశ్చర్యపరిచాయి.

నార్త్‌వెస్ట్ మసాచుసెట్స్‌కు(Northwest Massachusetts) చెందిన బక్స్‌టన్ స్కూల్(Buxton School) ఇటీవలే స్మార్ట్‌ఫోన్లపై నిషేధం(Smart phone ban) విధించింది. క్యాంపస్‌లో వాటికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ‘‘పిల్లలు తమ తొటివారితో ఎలా కలివిడిగా ఉండాలి, ముఖాముఖీ ఎలా సంభాషించాలి అనే విషయాలను కూడా మర్చిపోయారు. కరోనా సంక్షోభం తరువాత ఈ పరిస్థితి వచ్చింది’’ అని ఆ స్కూల్ హెడ్‌మాస్టర్ తెలిపారు. సమాజంలో భాగమైన అందరం కలివిడిగా ఉండాలన్న స్పృహ వారిలో కొరవడిందని చెప్పుకొచ్చారు. ఈ సెప్టెంబర్‌లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ నిషేధం స్కూల్ యాజమాన్యం ఊహించని ఫలితాన్నే ఇచ్చింది. పిల్లల్లో సృజనాత్మకత పెరిగిందని, కమ్యూనికేషన్ స్కిల్స్ వృద్ధి చెందాయని, ఉమ్మడిగా పలు ప్రాజెక్టులు చేపడుతూ విద్యార్థులు మానవసంబంధాల్లో మెళకువలు నేర్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి నిషేధం అసాధ్యమని భావించిన తమకు ఫలితాలు ఆశ్చర్యపరిచాయని అన్నారు.

Updated Date - 2022-12-05T21:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising