ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బోర్ కొట్టడంతోనే ఆ నేరం చేశా.. నిందితుడి సమాధానంతో పోలీసుల షాక్

ABN, First Publish Date - 2022-12-12T21:55:41+05:30

బ్యాంకు చోరికి పాల్పడ్డ నిందితుడు చెప్పిన సమాధానంతో పోలీసులే అవాక్కైన ఘటన తాజాగా అమెరికాలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బ్యాంకు దోపిడీకి పాల్పడ్డ నిందితుడు చెప్పిన సమాధానంతో పోలీసులే అవాక్కైన ఘటన తాజాగా అమెరికాలో(US) చోటుచేసుకుంది. ఫ్లోరిడా(Florida) రాష్ట్రానికి చెందిన నికోలాస్ జపాటర్-లమాడ్రిడ్(Nicolas Zapater-Lamadrid) తనకు బోర్ కొట్టి(Boredom) చోరీ చేశానని చెప్పి పోలీసులు అవాక్కైయ్యేలా చేశాడు. తొలుత డిసెంబర్ 5న ఓర్లాండోలోని టీడీ బ్యాంకు‌లో దోపిడీ(Bank Robbery) చేసిన అతడు రెండు రోజుల తరువాత.. ఓ పెట్రోల్ బంక్‌లో దోపిడీకి పాల్పడ్డాడు. దాడి, డబ్బు అని రెండు పదాలున్న చిట్టినీ బ్యాంకులోని క్యాషియర్‌కు ఇచ్చి చేతులు జేబులో పెట్టుకుని నిలబడ్డాడు. నికోలాస్ వాలకం చూసిన క్యాషియర్ అతడి జేబులో గన్ను ఉండే ఉంటుందని బయపడిపోయి.. డబ్బు చేతికిచ్చేశాడు. దీంతో.. నికోలాస్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత రెండు రోజులకు ఓ పెట్రోల్ బంక్‌లో దోపిడీకి దిగాడు. ఈసారి కూడా జేబులో చేతులు పెట్టుకుని నికోలాస్ నిలబడటంతో పెట్రోల్ బంక్‌లోని ఉద్యోగి అతడు చెప్పినట్టే చేశాడు. తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చేశాడు. అయితే..దోపిడీ సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నికోలాస్ అక్కడే చేతిలో డబ్బులతో నిలబడి ఉండటం చూసి అరెస్టు చేశారు. తాను తప్పు చేసినట్టు పోలీసులతో చెప్పిన నికోలాస్ బోర్ కొట్టడంతోనే ఈ తప్పు చేయాల్సి వచ్చిందని అనడంతో పోలీసులు అవాక్కయ్యారు.

Updated Date - 2022-12-12T23:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising