Viral News: 83ఏళ్ల బామ్మ.. 28ఏళ్ల యువకుడిపై మనసు పడింది.. ఏకంగా దేశం దాటి వచ్చి మరీ..
ABN, First Publish Date - 2022-11-07T13:56:43+05:30
ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఎక్కడ పుడుతుందో చెప్పడం కష్టమని చాలా మంది అంటుంటారు. ఈ క్రమంలోనే ఓ 83ఏళ్ల వృద్ధ మహిళ.. తన కంటే 55ఏళ్లు చిన్నవాడైన యువకుడిపై మనసు పడింది. అంతేకాదు.. ఏకంగా దేశం దాటొచ్చి మరీ..
ఎన్నారై డెస్క్: ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఎక్కడ పుడుతుందో చెప్పడం కష్టమని చాలా మంది అంటుంటారు. ఈ క్రమంలోనే ఓ 83ఏళ్ల వృద్ధ మహిళ.. తన కంటే 55ఏళ్లు చిన్నవాడైన యువకుడిపై మనసు పడింది. అంతేకాదు.. ఏకంగా దేశం దాటొచ్చి మరీ అతడిని వివాహం చేసుకుంది. తాజాగా ఆ జంట.. వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరపుకొంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాల్లోకి వెళితే..
83ఏళ్ల వయసు ఉన్న ఆ బామ్మ పేరు బ్రోమా( Broma). పోలాండ్‌కు చెందిన ఈమె.. పాకిస్థాన్‌కు చెందిన హఫీజ్ నదీమ్(Hafiz Nadeem) అనే 28ఏళ్ల యువకుడిని ఇష్టపడింది. అతడు కూడా ఆమెను ఇష్టపడటంతో ఇద్దరూ గత ఏడాది నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంట వివాహ వార్షికోత్సవ సంబరాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వాళ్ల లవ్ స్టోరీ గురించి తెలుసుకుని నెటిజన్లు షాకవుతున్నారు.
ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందంటే..
ఈ మధ్య చాలా మంది లవ్‌స్టోరీల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందనే వార్తలు వినే ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. బ్రోమా, హఫీజ్ నదీమ్ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి Facebook వేదికైంది. ఫేస్బుక్లో ఒకరికొరు పరిచయం అయిన ఈ ఇద్దరూ.. తర్వాత స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఈ క్రమంలోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. దీంతో బ్రోమా.. పోలాండ్‌ను వీడి పాకిస్థాన్‌లో ల్యాండ్ అయిపోయింది. అనంతరం ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లిపై ఇతడు ఏం అంటున్నాడంటే..
వివాహ వార్షికోత్సవం సందర్భంగా హఫీజ్ మాట్లాడాడు. ఆరేళ్ల క్రితం తొలిసారిగా బ్రోమాతో మాట్లాడినట్టు చెప్పాడు. అంతేకాదు పెళ్లికి ముందు తామిద్దరం ఒక్కసారి కూడా కలుసుకోలేదని తెలిపాడు. వివాహ వేడుకలోనే ఆమెను మొదటిసారిగా ప్రత్యక్షంగా చూసినట్టు చెప్పాడు. వివాహ సమయంలో ఇస్లాం సంప్రదాయాలను బ్రోమా చక్కగా పాటించిందని పేర్కొన్నాడు. జీవితాంతం కలిసి జీవించనున్నట్టు వెల్లడించాడు.
Updated Date - 2022-11-07T14:31:22+05:30 IST