ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

America లో ఆరుగురు భారతీయుల అరెస్ట్.. అంతా 18 నుంచి 21 ఏళ్ల లోపు వాళ్లే.. ఇంతకీ వాళ్లేం చేశారంటే..

ABN, First Publish Date - 2022-05-08T01:29:54+05:30

: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయులు తాజాగా అమెరికా పోలీసులకు చిక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయులు తాజాగా అమెరికా పోలీసులకు చిక్కారు. ఆరుగురు భారతీయులతో పాటూ మరో అమెరికన్‌ను న్యూయార్క్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారమే పోలీసులకు అక్రమరవాణా గురించి సమాచారం అందింది. కొందరు ఓ బోటులో రెజిస్ నది ద్వారా కెనడా నుంచి అమెరికా వైపు ప్రయాణిస్తున్నారన్న వారికి తెలిసింది. ఈ క్రమంలో వారు గురువారం అక్వెసాస్నే అనే ప్రాంతానికి చేరుకోగా.. అక్కడ మునిగిపోతున్న ఓ పడవలో ఏడుగురు ప్రయాణికులు వారి కంటపడ్డారు. దీంతో..పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని రక్షించారు. 


ఆ ఏడుగురికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం.. సరిహద్దు గస్తీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అదుపులో ఉన్న ఆరుగులు భారతీయులు  18 నుంచి 21 ఏళ్ల లోపు వయసున్న వారే! కాగా..  వివిధ పోలీసు శాఖ మధ్య సమన్వయం కారణంగా పెను ప్రమాదం తప్పిందని అక్వెసాస్నే పోలీసు అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రమాద సమయంలో బోటులో లైఫ్ జాకెట్లు లేవని తెలిపారు. గతంలోనూ ఓ భారతీయ కుటుంబం కెనడా నుంచి అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ గడ్డకట్టే చలికి తాళలేక మరణించిన విషయం తెలిసిందే. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!