ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Sydneyలో కనిపించకుండా పోయిన భారత సంతతి వ్యక్తి.. ఆచూకీ కోసం ప్రజల సహాయం కోరిన పోలీసులు

ABN, First Publish Date - 2022-05-06T18:59:37+05:30

సిడ్నీలో ఉండే 50 ఏళ్ల ఓ భారత సంతతి వ్యక్తి కనిపించకుండా పోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సిడ్నీ: సిడ్నీలో ఉండే 50 ఏళ్ల ఓ భారత సంతతి వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు న్యూసౌత్‌వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో అదృశ్యమైన భారత వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రజల సహాయం కోరారు. కనిపిస్తే తమకు చెప్పాలంటూ ఆ వ్యక్తి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఫోన్ నెంబర్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా న్యూసౌత్‌వేల్స్ పోలీసులు ఇండియన్ ఆచూకీ కోసం ప్రజల నుంచి ఇలా సహాయం కోరడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ సిడ్నీలో నివాసముండే షైవీంద్రనాథ్ శర్మ(50) గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కొలెబీలోని క్రిక్‌వుడ్ క్రిసెంట్‌లోని అతని నివాసంలో చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత నుంచి పత్తాలేకుండా పోయాడు. 


ఆ సమయంలో అతడు చార్కోల్ కలర్ టీషర్ట్, ప్యాంట్ ధరించాడు. కాళ్లకు షూలు గానీ, చెప్పులు గానీ లేవు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల తెలిసిన వారి ఇళ్లలో అంతా వెతికినా.. అతడి ఆచూకీ మాత్రం లభించలేదు. దాంతో న్యూసౌత్‌వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు శర్మ గురించి గాలించారు. పోలీసులకు కూడా అతడి ఆచూకీ దొరకలేదు. దాంతో శర్మ ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాల్సింది రివర్‌స్టోన్ పోలీసులు రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 98382199 లేదా క్రైం స్టాపర్స్ నం. 1800333000 కాల్ చేసి చెప్పాల్సిందిగా కోరారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!