ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Indian Driving licence ఉంటే చాలు.. ఈ 12 విదేశాల్లో కూడా కార్లలో షికార్లు చేయొచ్చు..!

ABN, First Publish Date - 2022-05-14T01:35:25+05:30

భారత ప్రభుత్వం జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌ను మొత్తం పన్నెండు దేశాలు గుర్తిస్తాయి. ఆయా దేశాల్లో డ్రైవింగ్ సైడ్ ఏదో గుర్తుపెట్టుకుంటే చాలు.. ఎంచక్కా కారు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: కారులో అలా అలా షికారు కెళ్లడం.. ఎవరికి నచ్చదు చెప్పండి..! కానీ ఇలా చేయాలంటే ఏ దేశస్తులకైనా  డ్రైవింగ్ లైసెన్స్ ఉండితీరాల్సిందే. మరి ఒక దేశంలోని డ్రైవింగ్ లైసెన్స్‌తో మరో దేశంలో డ్రైవింగ్ చేయవచ్చా..? భారత ప్రభుత్వం జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇతర దేశాలు గుర్తిస్తాయా.. ? అసలు మీకీ సందేహాలు ఎప్పుడైనా వచ్చాయా..? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే తాజాగా కథనం. 


సాధారణంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉన్నవారు.. అనేక దేశాల్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా కారు సొంతంగా డ్రైవ్ చేయచ్చు. అయితే.. కొన్ని దేశాలు ఇండియా లైసెన్స్‌ను కూడా గుర్తిస్తున్నాయి. కాకపోతే.. కొన్ని దేశాల్లో వాహనదారులు రోడ్డుకు ఎడమవైపు ప్రయాణించాలి. మరికొన్ని దేశాల్లో మాత్రం.. రైట్ సైడ్ డ్రైవింగ్ అమల్లో ఉంది.  భారత ప్రభుత్వం జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌ను మొత్తం పన్నెండు దేశాలు గుర్తిస్తాయి. ఆయా దేశాల్లో డ్రైవింగ్ సైడ్ ఏదో గుర్తుపెట్టుకుంటే చాలు.. ఎంచక్కా కారు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయచ్చు. 


ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ను గుర్తిస్తున్న దేశాలు ఇవే..

  1. బ్రిటన్ (డ్రైవింగ్ సైడ్: ఎడమవైపు)
  2. జర్మనీ (డ్రైవింగ్ సైడ్: కుడివైపు)
  3. ఫ్రాన్స్ (డ్రైవింగ్ సైడ్: కుడివైపు)
  4. న్యూజీల్యాండ్ (డ్రైవింగ్ సైడ్: ఎడమవైపు)
  5. స్వీడెన్ (డ్రైవింగ్ సైడ్: కుడివైపు)
  6. స్విట్జర్‌ల్యాండ్ (డ్రైవింగ్ సైడ్: కుడివైపు)
  7. ఆస్ట్రేలియా (డ్రైవింగ్ సైడ్: ఎడమవైపు)
  8. దక్షిణాఫ్రికా (డ్రైవింగ్ సైడ్: ఎడమవైపు)
  9. హాంకాంగ్ (డ్రైవింగ్ సైడ్: ఎడమవైపు)
  10. సింగపూర్ (డ్రైవింగ్ సైడ్: ఎడమవైపు)
  11. మలేసియా (డ్రైవింగ్ సైడ్: ఎడమవైపు)
  12. భూటాన్ (డ్రైవింగ్ సైడ్: ఎడమవైపు)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!