Toronto : టొరెంటోలో తెలుగు సినిమా
ABN, First Publish Date - 2022-12-18T00:28:42+05:30
వరుణ్ కోరుకొండ దర్శకుడిగా 6 సినిమాస్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల టొరెంటోలో ఈ చిత్రం లాంఛంగా మొదలైంది. వెన్నెల
వరుణ్ కోరుకొండ దర్శకుడిగా 6 సినిమాస్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల టొరెంటోలో ఈ చిత్రం లాంఛంగా మొదలైంది. వెన్నెల కిశోర్ కీలక పాత్రధారి. ‘‘కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎన్నో అవార్డులు సంపాదించుకొన్న వరుణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. వారి వివరాలతో పాటు టైటిల్ కూడా త్వరలో ప్రకటిస్తామ’’ని చిత్ర బృందం తెలిపింది.
Updated Date - 2022-12-18T00:28:42+05:30 IST