ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Subhashitam : క్షమ కవచంబు...

ABN, First Publish Date - 2022-12-08T23:59:50+05:30

క్షాంతిశ్చేత్‌ కవచేన కిం కిమరిభి: క్రోధోస్తి చేద్దేహినాం, ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షాంతిశ్చేత్‌ కవచేన కిం కిమరిభి: క్రోధోస్తి చేద్దేహినాం,

ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,

కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యానవద్యా

వ్రీడా చేత్‌ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్‌?

మానవులకు ఏవి ఉంటే ఏవి అవసరం లేదో ఈ శ్లోకంలో భర్తృహరి వివరించాడు.

దాన్ని ఏనుగు లక్ష్మణకవి...

క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి

త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్‌, సువిద్య వి

త్త, ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్య మీక్షమా

ప్రముఖ పదార్థముల్‌ గలుగు పట్టునఁదత్కవచాదు లేటికిన్‌?... అంటూ తెనిగించాడు.

‘‘ఓర్పు ఉన్న వ్యక్తికి వేరే కవచం అవసరం లేదు. కోపం ఉన్నవాడికి వేరే శత్రువులు ఉండక్కరలేదు. దాయాదులు ఉంటే వేరే నిప్పు అవసరం లేదు. మంచి మిత్రులు ఉన్న వ్యక్తికి ఔషధాలు అక్కరలేదు. దుష్టులు దగ్గరుంటే భయంకరమైన విష సర్పాలతో పని లేదు. మంచి విద్య ఉన్నవారికి మరే సంపదలూ అక్కరలేదు. లజ్జ ఉన్నవారికి ఎటువంటి ఆభరణాలూ అవసరం లేదు. ఉదాత్తమైన కవితాశక్తి ఉన్నవాడికి రాజ్యం అవసరం లేదు’’ అని భావం. అంటే సహనం రక్షిస్తుంది. కోపం నాశనం చేస్తుంది. దాయాదులు కీడు చేస్తారు. స్నేహితులు హితవు కోరి, మంచి దారి చూపిస్తారు. దుష్టులు హాని చేస్తారు. విద్య తరగని నిధిగా ఆదుకుంటుంది. లజ్జ... అంటే యుక్తమైన ప్రవర్తనే అలంకారమవుతుంది. ఉదాత్తుడైన కవి... పాలకులను మించిన కీర్తిని పొందుతాడు.

Updated Date - 2022-12-08T23:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising