ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Regret : పశ్చాత్తాపం

ABN, First Publish Date - 2022-12-09T00:02:04+05:30

మనం ఏదైనా తప్పు చేస్తే ‘సారీ’ అనేస్తాం. ఎంత పెద్ద తప్పునైనా ఆ చిన్న ఇంగ్లీషు మాటతో సరిపెట్టేస్తాం. ‘ఇక అయిపోయిందిలే’ అని అంతటితో ముగించేస్తాం. కానీ పశ్చాత్తాపం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం ఏదైనా తప్పు చేస్తే ‘సారీ’ అనేస్తాం. ఎంత పెద్ద తప్పునైనా ఆ చిన్న ఇంగ్లీషు మాటతో సరిపెట్టేస్తాం. ‘ఇక అయిపోయిందిలే’ అని అంతటితో ముగించేస్తాం. కానీ పశ్చాత్తాపం అనేది చాలా పెద్ద మాట. లోతైన మాట. ఒక చేయరాని పెద్ద తప్పు చేసినప్పుడు... మానసికంగా మధనపడడం, మళ్ళీ అలాంటి పనికి ఆస్కారం ఇవ్వకుండా మెలగడం... ఇదీ పశ్చాత్తాపంలోని అంతరార్థం. గతంలోని మంచి చెడులు నెమరువేసుకోవడం సర్వసహజం. చేసిన మంచిపనులకు ఎంతగా ఆనందించి గర్వపడతామో... చేసిన తప్పులకు అంతగానూ బాధపడాలి. ఇకపై అలా చేయకూడదనే నిర్ణయం తీసుకోవాలి. పశ్చాత్తాపానికి అదీ ఫలితం. తప్పు చేయడం మానవ నైజం. ఇది ఆదాము, హవ్వలతోనే స్పష్టమయింది. కానీ ఆ తప్పు చేసినందుకు వారు సిగ్గుపడ్డారు. దేవుడు చెప్పిన మాటను తప్పినందుకు, స్వేచ్ఛగా తమ సొంత బాటలో వెళ్ళినందుకు మానసికంగా బాధ పడ్డారు. తెలియక చేశామంటూ దేవుని ముందు సాగిలపడ్డారు. క్షమించమని అడిగారు.

తెలిసినా తెలియక పోయినా, జరగాల్సిన తప్పు జరిగి పోయినప్పుడు... ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని, సమీక్షించుకోవడం, బాధపడడం, ఎలా జరిగిందో తెలుసుకోవడం, ఇకపై జరగకుండా జాగ్రత్త పడడమే పశ్చాత్తాపం. కానీ పశ్చాత్తాపం... ఒక పడికట్టు మాటయిపోయింది. చేసిన తప్పులను, పాపాలను గురువులకు వెళ్ళబోసుకుంటే... ప్రక్షాళన జరుగుతుందనే నమ్మకం కొన్ని క్రైస్తవ శాఖల విశ్వాసాల్లో కనిపిస్తుంది. అయితే పశ్చాత్తాపంతోనే పాప పరిహారం జరగాలనీ, పాప పంకిలం కొట్టుకుపోయి, మనసు కడిగిన ముత్యమల్లే ప్రకాశించాలనీ, దానికి తోడు... పాప భీతి, దైవ చింతన, ప్రార్థన తోడు కావాలనీ మరికొన్ని శాఖల అభిమతం.

కేవలం పశ్చాత్తాపం వల్లే ఒకరు రక్షణ పొందగలరని చెప్పడంలో పారలౌకికార్థం ఏదైనప్పటికీ... లౌకికంగా చూస్తే... చేసిన తప్పు తెలుసుకొని, దిద్దుకున్నవారికి మానసిక శాంతి లభిస్తుంది. ఒత్తిడులు తొలగిపోతాయి. మంచి పనులు చేయాలనే సంకల్పం కలుగుతుంది. సంఘంలో మర్యాద లభిస్తుంది. అంటే... పశ్చాత్తాపం చెందిన వ్యక్తిని దేవుడు తన చెంతకు పిలిచి... అక్కున చేర్చుకున్నట్టేనని క్రైస్తవం చెబుతోంది.

పశ్చాత్తాపానికి గొప్ప ఉదాహరణలైన కథలు బైబిల్‌లో చాలా ఉన్నాయి. వాటిలో తప్పిపోయిన కుమారుడి ఉదంతం ఒకటి. బాగా సంపన్నుడైన ఒక వ్యక్తి నుంచి అతని చిన్న కొడుకు తన వాటా ఆస్తిని తీసుకున్నాడు. విలాసాల్లో మునిగి అంతా పోగొట్టుకున్నాడు. ఆకలికి ఓర్చుకోలేక... పందులు కాసే పనికి కుదిరాడు. తన గత వైభవాన్ని తలచుకొని విలపించాడు. చేసిన తప్పును తెలుసుకొని, పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరకు వచ్చాడు. అతణ్ణి తండ్రి ఎంతో ప్రేమతో ఆదరించాడు. అన్నీ మరచిపోయి, తన దగ్గక ఆనందంగా ఉండమన్నాడు.

పశ్చాత్తాపం పరివర్తనకు చిహ్నం. క్షమాపణ మరో కొత్త ఉదయానికి సూచిక.

డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2022-12-09T00:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising