ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Message : అల్లాహ్‌ కోసం స్నేహం చెయ్యాలి

ABN, First Publish Date - 2022-12-08T23:49:21+05:30

మానవ సంబంధాల్లో స్నేహానికి ఇస్లాం ధర్మం అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చింది. సాటివారితో నిష్కపటమైన స్నేహన్ని పవిత్రంగా భావించింది. ‘‘స్నేహం చేస్తే అల్లాహ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవ సంబంధాల్లో స్నేహానికి ఇస్లాం ధర్మం అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చింది. సాటివారితో నిష్కపటమైన స్నేహన్ని పవిత్రంగా భావించింది. ‘‘స్నేహం చేస్తే అల్లాహ్‌ కోసం చెయ్యాలి’’ అని ప్రవక్త మహమ్మద్‌ పేర్కొన్నారు. స్నేహాన్ని సృష్టిలోనే తియ్యనిదిగా కవులు వర్ణించారు. తల్లితండ్రులతో, తోబుట్టువులతో పంచుకోలేని విషయాలను మనం స్నేహితులతో చెప్పుకొంటాం. మన తప్పొప్పులను ఎత్తిచూపడం, మంచిని ప్రశంసించడం, చెడును సరిదిద్దడం, అవసరమైనప్పుడు సాయం చెయ్యడం, ఆపదల్లో విడువకుండా ఉండడం, రహస్యాలను దాచుకోవడం ఉత్తమ స్నేహితుడి లక్షణాలు. ఎలాంటి హద్దులూ, పరిమితులూ లేని బంధం స్నేహం. మంచి స్నేహం కోట్ల సంపదతో సమానం. స్నేహితులు లేని జీవితం నీరులేని నదిలో పడవ నడపడం లాంటిది. దాన్ని మించిన అనుభూతి మరొకటి లేదు.

ఇంతటి ఉన్నతమైన స్నేహాన్ని దైవారాధనగా మహాప్రవక్త అభివర్ణించారు. ‘‘నమాజ్‌, ఉపవాసాలు, జకాత్‌, హజ్‌ యాత్ర లాంటి ధర్మాలు మాత్రమే కాదు... స్నేహం కూడా ఒక ఆరాధనే. స్నేహం చేస్తే మనస్ఫూర్తిగా చేయండి’’ అని ఆయన సూచించారు. స్నేహం అనే భావన సాటివారిపట్ల ప్రేమను పెంచుతుంది. శత్రు భావాలను రూపుమాపుతుంది. అంతిమంగా దైవానికి చేరువ చేస్తుంది.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-12-08T23:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising