ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sudhashitham : అసలైన ఆభరణం

ABN, First Publish Date - 2022-11-10T22:35:49+05:30

కేయూరాణి న భూషయంతి పురుషం హారాః న చంద్రోజ్జ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా

Sudhashitham
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేయూరాణి న భూషయంతి పురుషం హారాః న చంద్రోజ్జ్వలాః

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా

వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

విద్వత్పద్ధతిని వివరించే ఈ శ్లోకం... భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత రత్నావళి (త్రిశతి - నీతి, శృంగార, వైరాగ్య శతకాలు)లోని నీతి శతకంలోనిది. ఆకాశవాణిలో సంస్కృత పరిచయ కార్యక్రమానికి ఇది శీర్షికా శ్లోకం.

భర్తృహరి సుభాషిత రత్నావళిని తెనిగించిన ఏనుగు లక్ష్మణకవి ఈ శ్లోకాన్ని...

భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్‌

భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్‌

భూషలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వా

గ్భూషణమే సుభూషణము భూషణముల్‌ నశియించు నన్నియున్‌ ...

అంటూ చక్కని పద్యంగా మలిచాడు. దర్పానికి చిహ్నమైన భుజకీర్తులు, మెడలో మెరిసే హారాలు, కేశాలకు సొగసైన అలంకారాలూ, పుష్పమాలలు, పన్నీటి స్నానాలు... ఇవేవీ మనిషికి అసలైన అలంకారాలు కావు. వినయం, సంస్కారం, మృదుత్వం కలిగిన మాటలే మనిషికి ఆభరణాలు. మిగిలిన అలంకారాలన్నీ నశించిపోతాయి. మంచి మాట శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి వాక్కు అనే భూషణమే భూషణం... అదే అసలైన ఆభరణం అని ఈ శ్లోక/ పద్యాల అంతరార్థం.

Updated Date - 2022-11-10T22:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising