ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మాధవ సేవ అంటే...

ABN, First Publish Date - 2022-05-13T05:30:00+05:30

మాధవ సేవ అంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మానవ సేవే మాధవ సేవ... సామాజిక సేవకు సంబంధించి లోకంలో తరచుగా వినిపించే మాట ఇది. ‘తోటి మానవులను సేవించడమే భగవంతుణ్ణి సేవించడం’ అని ఇది చెబుతుంది. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి... అసలు భగవంతుణ్ణి ప్రత్యేకంగా సేవించాల్సిన అవసరమే లేదంటారు. మానవ సమాజాన్ని సేవిస్తే... అదే మాధవ సేవ అవుతుందని వారి అభిప్రాయం. ఇంతకీ మాధవ సేవ అంటే ఏమిటి?

అది కేవలం ఆ మాధవుడు మాత్రమే చెప్పగలడు. మాధవుడికి ఏది కావాలో మనం ఊహించుకోకూడదు. ‘మామ్‌ నమస్కురు’ అని మాధవుడు అన్నప్పుడు... ఆయనకు శిరస్సు వంచి నమస్కరించడమే మాధవ సేవ అవుతుంది. అంతేతప్ప... ఎవరో మనిషికి నమస్కరించి, ఇదే మాధవసేవ అనడం సరికాదు. ఉదాహరణకు.. ‘భగవద్గీత’లో మాధవుడు ఈ గీతా సందేశాన్ని సమస్త మానవాళి తెలుసుకొనేలా ప్రచారం చేయడమే తనకు అత్యంత ప్రియమైన కార్యమని తెలిపాడు. దాన్ని అనుసరించి... ఎవరైనా భగవద్గీతా విజ్ఞానాన్ని మానవాళికి అందిస్తే... అది మాధవుడు ఆమోదించిన కార్యం కాబట్టి... అప్పుడు అది మాధవసేవ అవుతుంది. కాబట్టి ఏది మాధవసేవ అనేది ఆ మాధవుడు మాత్రమే నిర్ణయించగలిగే అంశం. ఇది ఎంతో సులభంగా అర్థం చేసుకోగలిగే విషయమే. కానీ, భగవద్విజ్ఞానం లేనివారు శాస్త్ర ప్రామాణికత లేని కల్పిత నినాదాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉంటారు. 

శ్రీకృష్ణుడినే ‘మాధవుడు’ అని ‘భగవద్గీత’ సంబోధించింది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి స్థానం ఏమిటో, జీవాత్మలైన మానవ, పశు, పక్ష్యాదుల స్థానం ఏమిటో వివరించింది.  ‘మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః’ అంటూ సమస్త జీవులూ తన అంశలేనని శ్రీకృష్ణుడు (భగవద్గీత 15:7)) ప్రత్యేకంగా తెలిపాడు. కనుక, సృష్టిలోని ప్రతి జీవి భగవంతుడైన మాధవునితో విడదీయలేని అన్యోన్యమైన సంబంధం కలిగినదే. అటువంటి వాసుదేవుని వసుధైక కుటుంబంలో... కేవలం మానవులను మాత్రమే సేవించి, ఇతర జీవులను చంపేస్తామంటే ఆ తండ్రి సంతోషిస్తాడా? తోటి జీవులను హింసిస్తూ ‘మానవ సేవే మాధవ సేవ’ అంటూ ఎన్ని నినాదాలు చేసినా, మాధవుడు ఎన్నటికీ సంతోషించడు. కాబట్టి... ప్రతిఒక్కరూ అసలు ఏది మాధవ సేవ అంటే ఏమిటనేది ‘భగవద్గీత,  శ్రీమద్భాగవతం’ లాంటి ప్రామాణిక గ్రంథాల నుంచి తెలుసుకొని ఆచరించాలి.


అదే నిజమైన భక్తి

భక్తి కేవలం మానసిక భావావేశం కాదు. భగవంతుణ్ణి సేవించడమే నిజమైన భక్తి. ఆచరణీయ ప్రామాణిక పద్ధతుల్లో శ్రీకృష్ణుణ్ణి సేవించడమే మాధవ సేవ. శ్రీకృష్ణుడికి ఎటువంటి సేవలను మనం చేయగలమో నవవిధ భక్తి మార్గాల రూపంలో ప్రహ్లాదుడు ‘శ్రీమద్భాగవతం’లో సవివరంగా తెలియజేశాడు:


శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్‌

అర్చనం వన్దనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్‌

ఎవరైతే ఈ నవవిధ భక్తి మార్గాల్లో స్వామిని సేవించేందుకు తమ జీవితాన్ని ఆర్పిస్తారో, అట్టివారే జ్ఞాన సంపూర్ణతను పొందిన ఉత్తములని ప్రహ్లాదుడు తెలిపాడు.


నవవిధ భక్తి మార్గాలకు ఆదర్శప్రాయులు

నవవిధ భక్తి మార్గాల్లో ఒక్కో మార్గాన్ని ఆచరించి జీవిత పరమసిద్ధిని సాధించిన వారిలో ఆదర్శనీయులను శాస్త్రం ఇలా వివరించింది:


శ్రవణం: భగవన్నామ శ్రవణం ద్వారా భగవంతుని దివ్య రూప, గుణ, లీలా వైభవాలను అర్థం చేసుకోగలం. దీనికి ఉదాహరణ పరీక్షిత్‌ మహారాజు.

కీర్తనం: దీనికి భాగవతాన్ని పలికిన శుక మునీంద్రుడే గొప్ప ఉదాహరణ. కీర్తనల ద్వారా అన్నమయ్య, త్యాగయ్య, రామదాసులాంటి వాగ్గేయకారులంతా దైవసన్నిధిని చేరిన సంగతి విదితమే.

స్మరణం: ఈ మార్గానికి ఉదాహరణ భక్త ప్రహ్లాదుడు. ఎన్ని ఆపదలు ఎదురైనా భగవంతుని స్మరణను మరవలేదు.

పాదసేవనం: నిరంతరం భగవంతుని పాదకమలాలను సేవించడమే పాదసేవనం. దీనికి ఉదాహరణ శ్రీమహాలక్ష్మీ దేవి.

అర్చనం: పత్రం, పుష్పం, ఫలం, తోయం... ఇత్యాది పూజా ద్రవ్యాలతో మనస్ఫూర్తిగా భగవంతుడి విగ్రహాన్ని పూజించడమే అర్చనం. ఇందుకు ఉదాహరణ పృథు మహారాజు.

వందనం: భగవంతుని గుణగణ వైభవం మీద మక్కువ ఉన్న భక్తులు... తమకు లభించిన ప్రతిదీ ఆ దేవదేవుని కృపేనని విశ్వసిస్తారు. సంపూర్ణ కృతజ్ఞతతో... తమ ప్రార్థనల ద్వారా భగవంతుణ్ణి సేవిస్తారు. దీనికి ఉదాహరణ అక్రూరుడు.

దాస్యం: జీవుడు తాను భగవంతుని నిత్యదాసుడినని తెలుసుకొని, భగవంతుని సేవలో నిమగ్నమై ఉండడమే దాస్యం. ఇందుకు ఉదాహరణ హనుమంతుడు.

సఖ్యం: భగవంతుడిని తమ స్నేహితుడిగా భావిస్తూ సేవించటమే సఖ్యం. ఇందుకు ఆదర్శం అర్జునుడు.

ఆత్మ నివేదనం: సర్వం భగవంతునికి అర్పించి, భగవంతుని ప్రీతి కోసం సేవలు ఆచరించడం ఆత్మనివేదనం. దీనికి ఉదాహరణ బలి చక్రవర్తి.

భక్తి మార్గాన్ని మరింత సులభతరం చేసి, ప్రస్తుత యుగంలో ప్రతి ఒక్కరికీ ఆచరణీయమైన మంత్రోపాసన మార్గాన్ని మహనీయులైన శ్రీచైతన్య మహాప్రభువు అందించారు. అదే...


హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ రామ రామ హరే హరే

భగవన్నామాన్నిజపించడం, వినడం అంటే... నవవిధ భక్తి మార్గాల్లో మొదటి రెండు మార్గాలైన శ్రవణం,  కీర్తనాలను ఆచరించడమే. ఇవే మాధవుణ్ణి సేవించే సరళమైన మార్గాలు.


సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, అధ్యక్షుడు, 

హరే కృష్ణ మూవ్‌మెంట్‌, హైదరాబాద్‌

9396956984

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!