ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఒక మంచి ఆలోచన!

ABN, First Publish Date - 2022-05-15T05:30:00+05:30

ఒక పిల్లాడు స్కూల్‌ మ్యాగజైన్‌లను అమ్మేవాడు. అలా అమ్ముకుంటూ ఒక పాత బంగ్లా దగ్గరకు చేరుకున్నాడు. ఆ ఇంటి వైపు ఎవరూ కూడా కన్నెత్తి చూడటానికి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఒక పిల్లాడు స్కూల్‌ మ్యాగజైన్‌లను అమ్మేవాడు. అలా అమ్ముకుంటూ ఒక పాత బంగ్లా దగ్గరకు చేరుకున్నాడు. ఆ ఇంటి వైపు ఎవరూ కూడా కన్నెత్తి చూడటానికి సాహసించే వారు కాదు. ఆ ఇంట్లో వాళ్లతో ఎవరూ మాట్లాడరు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో అక్కడి వాళ్లకు తెలియదు. అలాంటి ఇంటి తలుపు తట్టాడు ఆ బాలుడు. కాసేపయ్యాక ఆ ఇంటివైపు వెళ్లకూడదని స్నేహితులు చెప్పిన మాట గుర్తొచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ఆ ఇంటి డోర్‌ నెమ్మదిగా తెరుచుకుంది. ఒక వృద్ధుడు ఆ బాలుడిని ఎగాదిగా చూసి ‘ఏం కావాలి?’ అని అడిగాడు. ఆ బాలుడికి భయమేసింది. కానీ తన కోటా మాగ్యజైన్‌లను ఎలాగైనా అమ్మాలి. దాంతో ధైర్యం తెచ్చుకుని ‘‘నేను ఈ మ్యాగజైన్‌లు అమ్ముతున్నాను. మీరొకటి కొంటే సంతోషిస్తాను’’ అన్నాడు.


ఆ మాట విన్న వృద్ధుడు పిల్లాడిని తదేకంగా చూశాడు. అదే సమయంలో ఆ ఇంట్లో బోలెడు కుక్క బొమ్మలు ఉండటాన్ని బాలుడు గమనించాడు. వెంటనే ‘మీరు కుక్క బొమ్మలు సేకరిస్తారా?’ అని అడిగాడు. ‘అవును. నా ఇంట్లో బోలెడు కుక్క బొమ్మలు ఉన్నాయి. అవే నా కుటుంబం. నాకున్నవి అవే’ అన్నాడు. అతడు ఒంటరిగా ఉన్న విషయం బాలుడికి అర్థమయింది. ‘నాకు మ్యాగజైన్‌లు అవసరం లేదు. ఇక నువ్వు వెళ్లొచ్చు’ అంటూ డోర్‌ వేశాడు ఆ వృద్ధుడు. అంత పెద్ద ఇంట్లో ఆతను ఒక్కడే ఉంటున్నాడని తెలిశాక ఆ బాలుడిలో బాధ మొదలైంది. ఇంటికి వెళ్లాక ఒక ఆలోచన వచ్చింది. ఇంట్లో చాలా రోజుల క్రితం ఆంటీ ఇచ్చిన కుక్క బొమ్మ ఒకటి ఉంది. ఆ బొమ్మను తీసుకుని మళ్లీ ఆ వృద్ధుడి ఇంటికి బయలుదేరాడు. ఇంటి డోర్‌ కొట్టగానే వృద్ధుడు తలుపు తీశాడు. ‘‘నాకు మ్యాగజైన్‌ అవసరం లేదని చెప్పానుగా. మళ్లీ ఎందుకు  వచ్చావు’’ అన్నాడు కోపంగా. ‘ఆ విషయం నాకు తెలుసు. మీకోసం ఒక గిఫ్ట్‌ తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి’ అంటూ కుక్క బొమ్మ అందించాడు బాలుడు. ఆ బొమ్మను చూడగానే వృద్ధుడి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ‘‘ఇప్పటి వరకు నాకు ఇలా ఎవరూ బహుమతి ఇవ్వలేదు. నాకోసం ఎందుకు ఈ బొమ్మ తీసుకొచ్చావు?’’ అని అడిగాడు వృద్ధుడు. ‘‘మీకు కుక్క బొమ్మలంటే ఇష్టం కదా! అందుకే తెచ్చాను’’ అన్నాడు బాలుడు. అప్పటి నుంచి ఆ వృద్ధుడు బయటకు రావడం, అందరితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ బాలుడు, వృద్ధుడు మంచి స్నేహితులయ్యారు. ఆ బాలుడి మంచి ఆలోచన ఆ వృద్ధుడి జీవితాన్ని మార్చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!