Tiktok : ‘ఇన్విజిబుల్ చాలెంజ్’ జోలికి పోవద్దు
ABN, First Publish Date - 2022-12-02T23:44:14+05:30
టిక్‌టాక్ పాపులర్ సవాలు ‘ఇన్విజిబుల్ చాలెంజ్’ జోలికి వెళ్ళవద్దని సెక్యూరిటీ రిసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. స్పెషల్ వీడియో ఎఫెక్ట్ ‘ఇన్విజిబుల్ బాడీ’ని ఉపయోగించి నేక్డ్(నగ్న) ఫోజు తీసుకుని వీడియో
టిక్‌టాక్ పాపులర్ సవాలు ‘ఇన్విజిబుల్ చాలెంజ్’ జోలికి వెళ్ళవద్దని సెక్యూరిటీ రిసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. స్పెషల్ వీడియో ఎఫెక్ట్ ‘ఇన్విజిబుల్ బాడీ’ని ఉపయోగించి నేక్డ్(నగ్న) ఫోజు తీసుకుని వీడియో నుంచి బాడీని వేరు చేస్తారు. ఫలితంగా రియల్ ఇమేజ్ కాకుండా సంబంధిత ఆకృతి మాత్రమే కనిపిస్తుంది. ఇరవై అయిదు మిలియన్లకు మించిన వీక్షణలతో ఈ సవాలు బహుళ ఆదరణ పొందింది. అయితే సైబర్ సెక్యూరిటీ కంపెనీ చెక్‌మార్క్స్ ప్రకారం ఈ సవాలును హ్యాకర్లు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా టిక్‌టాక్‌ను ఉపయోగిస్తున్న డివైసుల్లో వైర్‌సను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. పాస్‌వర్డ్‌ను కూడా దొంగలిస్తున్నారు. అందుకోసం ఒక ట్రిక్ ఉపయోగిస్తున్నారు. ఆకృతికి ఉన్న ఫిల్టర్ తీసేస్తామని హ్యాకర్లు ఆఫర్ ఇస్తున్నారు. దాంతో నగ్న ఆకృతులను చూడొచ్చుని టిక్‌టాక్ యూజర్లు భావిస్తున్నారు. అలా నమ్మించి జొరబడిన హ్యాకర్లు వారితో డబ్ల్యుఎఎ్‌సపి స్టీలర్‌ను ఇన్‌స్టాల్ చేయించి డిస్‌కార్డ్ చేసిన అకౌంట్లు, పాస్‌వర్డ్స్, బ్రౌజర్లో స్టోర్ చేసిన క్రెడిట్ కార్డులు, క్రిప్టోకరెన్సీ వాలెట్స్ ఇంకా ముఖ్యమైన ఫైల్స్‌ను తస్కరిస్తున్నారు. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టిక్‌టాక్ నుంచి ఇదే మొదటి సవాలు కాదు. ఇంతకమునుపు కూడా టైడ్ పాడ్స్ చాలెంజ్, మిల్క్ క్రేట్ చాలంజ్, చాచా స్లయిడ్ చాలంజ్, పెన్నీ చాలంజ్, బర్నింగ్ వంటివి వచ్చాయి.
Updated Date - 2022-12-02T23:44:15+05:30 IST