అరికాళ్లు ఆరోగ్యంగా...
ABN, First Publish Date - 2022-12-29T00:06:54+05:30
సాధ్యమైనంత వరకూ చలికాలంలో సాక్సులు వాడటం చేయటం వల్ల ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు...
సాధ్యమైనంత వరకూ చలికాలంలో సాక్సులు వాడటం చేయటం వల్ల ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు అరికాళ్ల పగుళ్లున్న చోట కొబ్బరినూనెతో లేదా ఆముదంతో మర్దన చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని ఉప్పు లేదా చేతులు, కాళ్లను శుభ్రం చేసుకునే లిక్విడ్స్ వేసి పదిహేను నిముషాల పాటు కాళ్లను ఉంచాలి. బేకింగ్ సోడాను వేసినా సరే మంచి ఫలితం ఉంటుంది.
ఆర్గానిక్ పసుపు కొమ్మను నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి పగుళ్లకు పట్టిస్తే.. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల ఉపశమనం లభిస్తుంది. లవంగం లేదా పచ్చి ఏలకుల చూర్ణాన్ని నీటితో కలిపి పట్టిస్తే చక్కని ఫలితం ఉంటుంది.
Updated Date - 2022-12-29T00:06:55+05:30 IST