ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మహిళల్లో ఆ నొప్పికి ఇవీ కారణాలే!

ABN, First Publish Date - 2022-05-05T21:27:53+05:30

రొమ్ముల్లో నొప్పి అనగానే రొమ్ము కేన్సర్‌ స్ఫురించి, భయానికి లోనయ్యే మహిళలే ఎక్కువ.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(05-05-2022)

రొమ్ముల్లో నొప్పి అనగానే రొమ్ము కేన్సర్‌ స్ఫురించి, భయానికి లోనయ్యే మహిళలే ఎక్కువ. కానీ రొమ్ముల్లో నొప్పులకు వైద్య పరిభాషలో ‘మాస్టాల్జియా’ అనే పేరుంది. రొమ్ములకు సంబంధించిన సగం నొప్పులు ఈ కోవకే చెంది ఉంటూ ఉంటాయి. అయితే కేన్సర్‌ను మినహాయిస్తే, రొమ్ముల్లో నొప్పులకు ఐదు ప్రధాన కారణాలుంటాయి. అవేంటంటే... 


మాస్టైటిస్‌: రొమ్ముల్లో అసాధారణమైన వాపు, నొప్పి మొదలైతే బ్రెస్ట్‌ టిష్యూ ఇన్‌ఫెక్షన్‌గా భావించాలి. పాలిచ్చే తల్లుల పాల వాహికల్లో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడం మూలంగా ఈ సమస్య మొదలవుతూ ఉంటుంది. బిడ్డ నోట్లోని బ్యాక్టీరియా పాలివ్వడం ద్వారా రొమ్ముల్లోకి చేరి, మాస్టైటిస్‌ను కలిగిస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ గడ్డగా మారి ఇబ్బంది పెట్టేలోగా వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.


ఫైబ్రోమాస్‌: రొమ్ముల్లో ఏర్పడే గడ్డలన్నీ కేన్సర్లు కావు. ఇలాంటి బినైన్‌ ట్యూమర్‌నే ఫైబ్రోమా అంటారు. 30 ఏళ్ల లోపు మహిళల్లో ఇవి సహజం. ఇవి చర్మం మీద కదులుతూ, చేతికి తగులుతూ ఉంటాయి. ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ మూలంగా ఏర్పడే ఈ గడ్డలు గర్భం దాల్చినప్పుడు పరిమాణాన్ని పెంచుకుంటాయి. ఇవి అసౌకర్యంగా మారితే సర్జరీతో తొలగించుకోవచ్చు.


సిస్టులు: గడ్డల్లాంటి ఈ సిస్టులు రొమ్ము కణజాలంలో ఏర్పడతాయి. వీటిలో ద్రవాలే తప్ప, కేన్సర్‌ కారక కణాలు ఉండవు. అలా్ట్రసౌండ్‌ పరీక్షతో కనిపెట్టగలిగే ఈ సిస్టులకు ఎటువంటి చికిత్సా అవసరం లేదు. అయితే లక్షణాల తీవ్రతను బట్టి వైద్యులు అవసరమైన చికిత్సను సూచిస్తారు.


నెలసరి: నెలసరి సమయంలో రొమ్ముల సలపరం సహజం. ఈ లక్షణం ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌లో ఓ భాగం. నెలసరి సమయంలో విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ వల్ల రొమ్ముల్లోని పాల గ్రంథులు వాచి, నొప్పి పెడతాయి. కాబట్టి భయపడవలసిన పని లేదు.

 

డైట్‌: ఉప్పు, కెఫీన్‌, అత్యధిక కొవ్వులుండే ఆహారం ఎక్కువగా తీసుకుంటున్న మహిళల్లో కూడా రొమ్ముల నొప్పి ఉంటుంది. కొందర్లో చాక్లెట్‌, వేరుసెనగలు, వాల్‌నట్స్‌, బాదం, ఇతరత్రా డ్రై ఫ్రూట్స్‌తో కూడా నొప్పి మొదలవుతుంది. కాబట్టి ఏ పదార్థాలతో సమస్య మొదలవుతుందో ఎవరికి వారు గమనించుకోవాలి. వాటిని తినడం మానుకున్నా నొప్పి వేధిస్తుంటే, వైద్యులను సంప్రతించాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!