ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పాలిచ్చే తల్లులకు మెంతులు చేసే మేలు!

ABN, First Publish Date - 2022-05-10T17:39:42+05:30

చిరు చేదుగా ఉండే మెంతుల వాడకం వంటకాల్లో తక్కువే! కానీ పిల్లలకు పాలిచ్చే తల్లులకు మెంతులు మేలు చేస్తాయి. పాల ఉత్పత్తిని పెంచి, పసికందుకు పాల కొరత తీరుస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(10-05-2022)

చిరు చేదుగా ఉండే మెంతుల వాడకం వంటకాల్లో తక్కువే! కానీ పిల్లలకు పాలిచ్చే తల్లులకు మెంతులు మేలు చేస్తాయి. పాల ఉత్పత్తిని పెంచి, పసికందుకు పాల కొరత తీరుస్తాయి.


మెంతుల్లో ఉండే ‘డయాస్జొనిన్‌’ చనుపాలు ఉత్పత్తయ్యే మామరీ గ్రంథులలోని కణజాలం పెరుగుదలకు, తోడ్పడుతుంది. ఫలితంగా పాలు త్వరితంగా, ఎక్కువగా తయారవుతాయి. ఇందుకోసం రోజుకు 10 మెంతులను తీసుకుంటే సరిపోతుంది. రోజుకు ఒకటి లేదా రెండు మెంతి లడ్లను పాలిచ్చే తల్లులకు తినిపంచవచ్చు. వీటికి బెల్లం, శొంఠి, డ్రై ఫ్రూట్స్‌, నెయ్యి జోడించాలి. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మెంతి పొడికి, పసుపు, శొంఠి, బెల్లం, ఇతర మూలికలు చేర్చి ఉడికించి, హల్వా ఉండగా చేసి పరగడుపున తినిపించడం ఆనవాయితీ. ఈ ఉండల్లో నెయ్యి, తీపి ఎక్కువ కాబట్టి వీటిని తినడానికి భయపడవలసిన అవసరం లేదు. పాల వృద్ధికి తోడ్పడే మెంతి లడ్డుతో బిడ్డకు జరిగే మేలు ముందు అదనపు క్యాలరీల గురించి భయపడడంలో అర్థం లేదు. నిజానికి పాత రోజుల్లో ఇలాంటి క్యాలరీలు అధికంగా ఉండే పదార్థాలను మహిళలు ప్రసవించిన సమయంలో ఇచ్చేవారు.


తొలి ప్రసవం అయిన తల్లులకు వారికి నచ్చిన తీపి పదార్థాలు, పళ్లు, కాయలు అందించేవారు. పైగా ఆ సమయంలో పెరిగే అదనపు శరీర బరువు బిడ్డకు పాలివ్వడంతో తరిగే వీలూ లేకపోలేదు. ఒకవేళ బరువు పెరగకుండా మెంతుల మేలు అందుకోవాలనుకుంటే, మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా మెంతులను పొడి చేసి, తేనె లేదా గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. అయితే గర్భిణులు మెంతులకు దూరంగా ఉండాలి. గ్యాలెక్టగోగ్‌ కోవకు చెందిన మెంతుల్లో యుటెరోటోనిక్‌ ఏజెంట్‌ ఉంటుంది. ఇది కండరాల సంకోచ వ్యాకోచాలకు కారణమవుతుంది. కాబట్టి గర్భవిచ్ఛిత్తికి ఆస్కారం ఉంటుంది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!