అవిసెలు ఆచితూచి
ABN, First Publish Date - 2022-11-15T00:20:51+05:30
అవిసె గింజలు కచ్చితంగా ఆరోగ్యకరమే! అయితే అతి అనర్ధాన్ని తెచ్చే చందంగా, అవిసె గింజలను మితిమీరి తీసుకున్నా చేటే మిగులుతుంది..
అవిసె గింజలు కచ్చితంగా ఆరోగ్యకరమే! అయితే అతి అనర్ధాన్ని తెచ్చే చందంగా, అవిసె గింజలను మితిమీరి తీసుకున్నా చేటే మిగులుతుంది. కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ వాడకంలో తగు జాగ్రత్తలు పాటించాలి.
అవిసె గింజలకూ కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. వీటిలో ఫైటిక్ యాసిడ్, సయనోజెనిక్ గ్లైకోసైడ్స్ యాంటీ న్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి పోషకాలు శరీరంలో శోషణ చెందకుండా అడ్డుకుంటాయి. కొంతమందికి అవిసె గింజల అలర్జీ ఉంటుంది. వీటిని తీసుకున్న కొందర్లో వాంతులు, చర్మం మీద దద్దుర్లు, ముఖం వాపు లాంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. వీటిలోని అత్యధిక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రక్తం గడ్డకట్టే వేగాన్ని నెమ్మదించేలా చేసి, రక్తస్రావానికి కారణమవుతుంది. అవిసె గింజల్లో పీచు ఎక్కువ. అవసరానికి మించి తీసుకుంటే మలబద్ధకం తప్పదు. అలాగే ఈ గింజలను అతిగా తింటే, సయనైడ్ టాక్సిసిటీకి లోనవుతాం. కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ దుష్ప్రభావాలకు గురవకుండా ఉండడం కోసం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి.
మోతాదు: రోజు మొత్తంలో ఒకటి లేదా రెండు స్పూన్ల అవిసె గింజల పొడి తీసుకోవచ్చు. లేదా ఒక టేబుల్ స్పూను ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తీసుకోవచ్చు. 9 నుంచి పది గ్రాములు లేదా ఒక టేబుల్ స్పూను అవిసెగింజలను తీసుకుంటే రోజుకు సరిపడా అల్ఫా లినోలిక్ యాసిడ్ శరీరానికి అందుతుంది.
Updated Date - 2022-11-15T00:20:52+05:30 IST