ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు తెలుసా?

ABN, First Publish Date - 2022-12-10T00:19:30+05:30

పండుగల సమయంలో ఆనందం, ఉత్సాహం నింపటానికి పోటీలు నిర్వహించటం ఎక్కడైనా మావూలే. అయితే స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్‌ పర్వత ప్రాంతాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పండుగల సమయంలో ఆనందం, ఉత్సాహం నింపటానికి పోటీలు నిర్వహించటం ఎక్కడైనా మావూలే. అయితే స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్‌ పర్వత ప్రాంతాల్లో జరిగే సైకిళ్ల పోటీ మాత్రం విభిన్నంగా ఉంటుంది. దీని పేరు ‘మౌంటెన్‌ బైక్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌’. ఈ పోటీ నేలమీద కాదండోయ్‌.. మంచుమీద సైకిల్‌ తొక్కాలనమాట. చిన్న, పెద్ద అంతా కలిసి ఈవ్‌ సంబరాల్లో భాగంగా ఈ సైకిళ్ల పోటీని జరుపుతారు. అంటే డిసెంబర్‌ 31 వ తేదీన ఈ పోటీ ఉంటుంది.

మంచులో ఈ ‘మౌంటెన్‌ బైక్‌ రేస్‌’ను గత 30 ఏళ్లనుంచీ జరుపుతున్నారు అక్కడ స్థానికులు. ఈ ఏడాది 33 వ పోటీ జరగనుంది. మంచు కొండపై సైకిళ్లను నడపటం మామూలు విషయం కాదు. మంచు బండలపై జారడం, కిందపడటం, దెబ్బలు తగలటం సాధారణ విషయం. అందుకే హెల్మెట్స్‌ ధరించటం తప్పనిసరి. చిన్న సైకిళ్లపై పెద్దలు ప్రయాణించటం లాంటి సరదా సన్నివేశాలుంటాయిక్కడ. ఇక్కడ క్రియేట్‌ అయ్యే ఫన్‌ను చూడటానికి వేల సంఖ్యలో ఇక్కడకు జనాలు

వస్తారు. పదేళ్లలోపు పిల్లలు పాల్గొనాలంటే వాళ్ల పేరెంట్స్‌తో అక్కడకు రావాలి. ఎవరైనా సరే ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ చేసుకుని మాత్రమే పాల్గొనాలి. లేకుంటే అనుమతి ఉండదు. చిన్న పిల్లలు, స్త్రీలు, పురుషులు, 40 ఏళ్ల వయసున్న వాళ్లు.. ఇలా అన్ని వయసు స్లాట్స్‌లో బహుమతులు ఇస్తారు.

Updated Date - 2022-12-10T00:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising