ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Therapy : వీటితో డిమెన్షియా దూరం

ABN, First Publish Date - 2022-11-28T23:07:00+05:30

డిమెన్షియా రోగుల జీవితాలు మెరుగవ్వాలంటే వైద్యపరమైన చికిత్స ఒక్కటే సరిపోదు. మతిమరుపుతో క్రమం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిమెన్షియా రోగుల జీవితాలు మెరుగవ్వాలంటే వైద్యపరమైన చికిత్స ఒక్కటే సరిపోదు. మతిమరుపుతో క్రమం తప్పిన దైనందిన జీవితాన్ని గాడిలో పడేలా చేసే థెరపీలను కూడా అనుసరించాలి. అవేంటంటే...

స్పీచ్‌ థెరపీ: డిమెన్షియా రోగుల్లో కనిపించే ప్రధాన సమస్యల్లో ఒకటి చెప్పాలనుకున్న విషయాన్ని మాటల్లో వ్యక్తం చేయలేకపోవటం. ఈ సమస్యను అధిగమించడానికి రోగులకు స్పీచ్‌ థెరపీ తప్పక ఇవ్వాలి. ఈ థెరపీలో భాగంగా ఫొటోలు, సైగల ద్వారా చెప్పాలనుకున్న విషయాన్ని వ్యక్తం చేయగలిగేలా శిక్షణ ఇస్తారు.

ఫిజియోథెరపీ: డిమెన్షియా రోగుల్లో కనిపించే మరో సమస్య అవయవాల్లో సమన్వయ లోపం. దీని వల్ల నడిచేటప్పుడు తరచుగా పడిపోతూ ఉంటారు. చేతులు పట్టుతప్పి వస్తువులను పడేస్తూ ఉంటారు. ఈ సమస్యకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా కాళ్లు, చేతుల్ని కదిలించే వ్యాయామాలు చేయిస్తారు.

పిఇజి థెరపీ: పెగ్‌ థెరపీ అని పిలిచే ఈ చికిత్సను పోషకాహార లోపాన్ని సరిచేయటం కోసం అనుసరిస్తారు. డిమెన్షియా రోగులు తగినంత ఆహారం తీసుకోకపోవటం వల్ల తరచుగా పోషకాహార లోపానికి లోనవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు పెగ్‌ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ థెరపీలో భాగంగా పొట్ట భాగంలో రంథ్రం చేసి ఫీడింగ్‌ ట్యూబ్‌ను అమర్చి దాని ద్వారా మందులు, ఆహారాన్ని పంపిస్తూ ఉంటారు. ఇలాంటి ఏర్పాటు వల్ల మింగే పనిలేకుండా ఆహారం, మందులు నేరుగా పొట్టలోకి చేరిపోతాయి.

Updated Date - 2022-11-28T23:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising