YouTube Music : కస్టమైజ్డ్ ప్లే లిస్ట్
ABN, First Publish Date - 2022-12-16T23:27:45+05:30
సామాజిక మాధ్యమాలన్నీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ ఉంటాయి. యూట్యూబ్ కూడా ఈ విషయంలో ముందుంటుంది. అందులో భాగంగా
సామాజిక మాధ్యమాలన్నీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ ఉంటాయి. యూట్యూబ్ కూడా ఈ విషయంలో ముందుంటుంది. అందులో భాగంగా ఎక్స్‌పెరిమెంటల్(ప్రయోగస్థాయి) ఫీచర్లను యూట్యూబ్ మొదట ప్రీమియమ్ సబ్‌స్క్రయిబర్లకు అందిస్తుంది. కొద్ది సంఖ్యలో ఉన్న ఆ ప్రీమియం చందాదారులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ సహాయంతో అవసరమైన మెరుగులు చేస్తుంది.
తాజాగా ‘యాడ్ టు క్యూ’ ఫీచర్‌ను టెస్టింగ్‌లో పెట్టింది. యూట్యూబ్ వెబ్‌సైట్, యూట్యూబ్ మ్యూజిక్‌లో అందుబాటులో ఉంది. వీడియోలు లేదా సాంగ్స్‌తో కస్టమైజ్డ్ టెంపరరీ ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. సేవ్ టు వాచ్ లేటర్ లేదా సేవ్ టు ప్లేలిస్ట్ ఫీచర్ల విషయంలో అయోమయానికి లోనుకారాదు. అవి శాశ్వతం గా సేవ్ చేసుకునే అలాగే తిరిగి చూసే లేదా వినే అవకాశాన్ని కల్పిస్తాయి. మూడు చుక్కల ఓవర్ ఫ్లో మెనూలో ప్రతి వీడియోకు ఈ ప్లే లాస్ట్ ఇన్ క్యూ అన్న ఆప్షన్ ఉంటుంది. ముందుకు, వెనక్కు జరిపి వీక్షణ విషయంలో ఆర్డర్‌ను మార్చుకోవచ్చు. మినీ ప్లేయర్‌ను క్లోజ్ చేస్తే ప్లేలిస్ట్ క్లియర్ అవుతుంది.
యూట్యూబ్ ప్రీమియం చందాదారులకు మాత్రమే మరొకటి ‘లైనప్ వాచ్ టు వాచ్’ విడుదలైంది. ఏదైనా ఒక వీడియోను యూట్యూబ్‌లో ప్లే చేస్తే, ఆటోమేటిక్‌గా క్యూలోకి వచ్చి చేరుతుంది. వీటి కోసం ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లో మొదట యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేయాలి. ప్రొఫైల్ అవతార్‌ని టాప్ చేసి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి. ట్రై న్యూఫీచర్స్‌ని టాప్ చేయాలి లేదంటే ప్రొఫైల్ అవతార్‌ని తదుపరి యువర్ ప్రీమియమ్ బెనిఫిట్స్‌ను టాప్ చేయాలి. ట్రై న్యూ ఫీచర్‌ని టాప్ చేస్తే టెస్టింగ్ వివిధ ఫీచర్లు కనిపిస్తాయి. అయితే ఇది టెస్టింగ్ కోసం వచ్చే ఏడాది జనవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Updated Date - 2022-12-16T23:27:58+05:30 IST