రైల్వే టీసీ జాబ్ పేరిట అపాయింట్‌మెంట్ లెటర్లు.. ఆ తర్వాత తెలిసింది షాకింగ్ నిజం

ABN , First Publish Date - 2022-05-03T22:00:04+05:30 IST

థానే : రైల్వేస్‌లో టికెట్ కలెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానంటే 12 మంది అమాయకులు నమ్మారు. సీల్ వేసిన అపాయింట్‌మెంట్ లెటర్లు చేతిలో పెట్టడంతో వారికి సందేహాలు రాలేదు.

రైల్వే టీసీ జాబ్ పేరిట అపాయింట్‌మెంట్ లెటర్లు.. ఆ తర్వాత తెలిసింది షాకింగ్ నిజం

థానే : రైల్వేస్‌లో టికెట్ కలెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానంటే  12 మంది అమాయకులు నమ్మారు. సీల్ వేసిన అపాయింట్‌మెంట్ లెటర్లు చేతిలో పెట్టడంతో వారికి సందేహాలు రాలేదు. ఈ లెటర్లను పట్టుకుని నేరుగా సెంట్రల్ రైల్వేస్ ఆఫీస్ వద్ద రిపోర్టింగ్‌కు వెళ్లారు. అక్కడ తెలిసింది అసలు నిజం. అవి నకిలీ లెటర్లు అని అధికారులు తేల్చారు. కంగుతున్న ఆశావహులు లబోదిబోమన్నారు. 12 మంది అభ్యర్థులు మొత్తం రూ.60 లక్షలను ఓ కిలాడీ మహిళకు చెల్లించామని చెప్పారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితురాలిని సుశీలా డెరోగా పోలీసులు గుర్తించారు. రైల్వేలో టికెట్ కలెక్టర్లు, రైళ్లలో హెల్పర్లుగా ఉద్యోగాలిప్పిస్తానంటూ ఆమె మోసగించిందని తేలింది. ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చిందని తేలింది. మోసం తెలుసుకుని ప్రశ్నించిన తర్వాత తిరిగి డబ్బులు ఇస్తానంటూ వారికి చెక్కులు ఇచ్చింది. కానీ అవి బౌన్స్ అవ్వడంతో అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడింది. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.


Read more