Gangster దూబే క్యాషియర్ జై బాజ్‌పాయ్ ల్యాండ్ మాఫియా...District Magistrate ప్రకటన
ABN , First Publish Date - 2022-05-07T13:46:46+05:30 IST
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే క్యాషియర్ జై బాజ్‌పాయ్‌ను కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ల్యాండ్ మాఫియాగా ప్రకటించారు....

కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే క్యాషియర్ జై బాజ్‌పాయ్‌ను కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ల్యాండ్ మాఫియాగా ప్రకటించారు.వికాస్ దూబే కోశాధికారి జై బాజ్‌పాయ్‌తో పాటు మరో ఇద్దరిని కాన్పూర్ నగరంలోని ల్యాండ్ మాఫియాల జాబితాలో చేర్చింది.గత ఏడాది కాన్పూర్‌లో జరిగిన బిక్రు కుంభకోణంలో 60కి పైగా క్రిమినల్ కేసులు ఉన్న హిస్టరీ షీటర్ వికాస్ దూబే పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.జిల్లా ఉన్నతాధికారులతో కాన్పూర్ డీఎం నేహా శర్మ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం బిక్రు కేసులో జైల్లో ఉన్న జై బాజ్‌పాయ్‌పై ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ యాక్ట్ విధించారు.2020 వ సంవత్సరం జులైలో యూపీలోని బిక్రు గ్రామంలో వికాస్ దూబే సహచరులు పోలీసు బృందంపై మెరుపుదాడి చేసి 8 మంది పోలీసులను కాల్చి చంపారు.
రైల్వేకు చెందిన విలువైన భూమిని స్వాధీనం చేసుకొని ఎక్కువ ధరకు విక్రయించిన క్యాషియర్ జై బాజ్‌పాయ్ పై బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ (బిఓ) డీఎం, రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు కాన్పూర్ డీఎం నేహా శర్మ భాజపాయ్ స్వాధీనం చేసుకున్న భూమిలో బుల్ డోజర్లను మోహరించి అక్రమ ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు.బాజ్‌పాయ్‌తో పాటు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ శివేంద్ర సింగ్ సెంగార్, బీఏసీఎల్ కంపెనీ యజమాని బ్రిజేష్ సింగ్‌లను కూడా నగర పాలక సంస్థ ల్యాండ్ మాఫియాలుగా ప్రకటించింది.సెంగర్ కోట్ల రూపాయల విలువైన కార్మిక శాఖ, కాన్పూర్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన భూమిని ఆక్రమించుకున్నాడు. సింగ్ బింగావాన్‌లోని అర్బన్ సీలింగ్ భూమిని ఆక్రమించాడు.